ఈ సినిమాతో హిట్ కొడుతుందా..?

ప్రీతి అశ్రాని బాలనటిగా తెలుగులో అందరికీ సుపరిచితురాలే అయినా కూడా ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అనే అంటారు అందరూ. అంతేకాదు, రీసంట్ గా కొన్ని సినిమాల్లో లీడ్ క్యారెక్టర్ లో అలాగే హీరోయిన్ గా నటించినా కూడా ప్రీతి అశ్రాని అనే పేరు మాత్రం ఎవరకీ తెలియదు. అయితే, ఇప్పుడు సీటీమార్ లో కబడ్డీ టీమ్ కెప్టెన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ప్రీతి ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, గుండెల్లో గోదారి సినిమాల్లో నటించింది.

అంతేకాదు, మళ్లీ రావా సినిమాతో తెలుగు వాళ్లకి కాస్త దగ్గరైంది. నిజానికి ప్రీతి అస్రాని గుజరాత్ కి చెందిన అమ్మాయి. సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చింది. ‘ఫిదా’ అనే షార్ట్ ఫిలిం లో ఫస్ట్ నటించింది. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి అనే సీరియల్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. కొన్ని కారణాల వల్ల ఆ సీరియల్ ఆగిపోయింది. తర్వాత సుమంత్ యాక్ట్ చేసిన మళ్లీరావా అనే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో స్కూల్ గర్ల్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. అప్పుడే ఆ అమ్మాయికి బ్రేక్ వచ్చింది.

ప్రీతి బీటెక్ వరకూ చదువుకుంది. మంచి డ్యాన్సర్. సీరియల్ ఆర్టిస్ట్ అంజు అస్రాని కి చెల్లి. రీసంట్ గా వచ్చిన ప్రెషర్ కుక్కర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది ప్రీతి ఆశ్రాని. అంతేకాదు, రీసంట్ గా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘A’ అనే సినిమాలో హీరోయిన్. యుగంధర్ ముని తీసిన ఈ సినిమా మార్చి 5వ తేదిన రిలీజ్ కాబోతోంది. ఇక ఏప్రిల్ 2వ తేదిన గోపిచంద్ సీటీమార్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus