‘సైరా’ సినిమా తర్వాత చిరంజీవి వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కుర్ర హీరోలు కూడా సినిమా తర్వాత సినిమా అంటూ లెక్కలేసుకుని చేస్తుంటే చిరంజీవి మాత్రం ఒకేసారి సెట్స్ మీద నాలుగు సినిమాలు పెట్టారు. కొన్ని లైన్‌లో పెట్టారు. అయితే ఇప్పుడు లైన్‌లో సినిమాలన్నీ అయిపోయాయి. దీంతో చిరంజీవి లైనప్ సంగతేంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి చేసే సినిమా ఏంటి? అనే ప్రశ్న, చర్చ టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో జరుగుతోంది.
సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’గా వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి చిరంజీవికి పూర్వపు జోష్‌ని తీసుకొచ్చిందీ సినిమా. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బందిగా అనిపిస్తున్న చిరుకి, చిరంజీవి ఫ్యాన్స్‌కి ‘వాల్తేర్ వీరయ్య’ పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంతలా సినిమా విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే కాస్త నొచ్చుకున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారనుకోండి. దీంతో ఫుల్ మాస్ మసాలా విత్ సింగిల్ చిరంజీవి కావాలనే ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’ పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. దీంతో నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న మొదలైంది. వెంకీ కుడుములతో ఓ సినిమాని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా పక్కకెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ సినిమా రేసులో ముగ్గురు దర్శకులు కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్, మురుగదాస్, కల్యాణ్ కృష్ణనే ఆ ముగ్గురు డైరక్టర్లు అని సమాచారం.
‘గాడ్‌ఫాదర్’ సమయంలో పూరిని తనతో సినిమా చేయమని అడిగారు చిరు. ప్రస్తుతం పూరి అదే పనిలో ఉన్నారు. మరోవైపు మురుగదాస్ కూడా చిరంజీవికి ఓ కథ వినిపించారట. అలాగే కల్యాణ్ కృష్ణ కూడా ఓ పాయింట్ చెప్పారని టాక్. మూడూ బాగుంటే, మూడ్ బాగుంటే మూడూ ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?