Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

ప్రస్తుతం బాలీవుడ్‌ మీడియా, ముంబయి వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు టైగర్‌ ష్రాఫ్‌, లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌. ఇటీవల టైగర్‌ మీద బిష్ణోయ్‌ గ్యాంగ్‌ దాడి చేయడంతో.. మరోసారి ఆ బృందం పేరు చర్చలోకి వచ్చింది. గతంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఆ గ్యాంగ్‌ బెదిరింపులకు పాల్పడింది. ఒకనాకొ సందర్భంలో సల్మాన్‌ మీద దాడి ప్రయత్నం కూడా చేశారు. అయితే టైగర్‌ మీద దాడి చేశారు. ఈ కేసును విచారించే క్రమంలో రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది.

Bishnoi Gang

మొన్నీ మధ్య వరకు టైగర్‌ ష్రాఫ్‌ అసలు టార్గెట్‌ కాదు అని చెబితే.. అవును సల్మానే టార్గెట్‌ అని తెలుసు అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత టైగర్‌ కంటే ముందు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ మీద దాడి చేయాలనుకున్నారు అనే వార్త వచ్చింది. దాంతో ఆయన ఇంటి దగ్గర భద్రత పెంచారు. అయితే ఇప్పుడు బిష్ణోయ్‌ బృందం టార్గెట్‌ ఆమిర్‌ ఖాన్‌ అని తాజాగా వార్తలొస్తున్నాయి. దీంతో అసలు టార్గెట్‌ ఎవరు అనే ప్రశ్న మొదలైంది.

హరియాణా నుండి ఇద్దరు షూటర్లు సెప్టెంబర్‌ 20న ముంబయికి చేరుకున్నారు. నెల రోజుల పాటు నగరంలో ఉంటూ అమిర్‌ ఖాన్‌ నివాస ప్రాంతాన్ని మూడుసార్లు పరిశీలించారు. అయితే, ఆయన షూటింగ్‌ నుండి వచ్చి ఇంట్లోకి వెళ్లాక రోజుల తరబడి బయటకు రాకపోవడంతో నిందితులు తమ ప్రణాళికను మార్చుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారని బాలీవుడ్‌ వార్తల సారాంశం.

ఈ క్రమంలో అక్టోబర్‌ మొదటి వారంలో టైగర్‌ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. టైగర్‌ ఆదివారాల్లో ఫుట్‌బాల్‌ ఆడేందుకు వస్తుండటం నిందితుల దృష్టికి వచ్చిందట. దాంతో దాడికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. అయితే అమిర్‌ ఖాన్‌కు జులైలో బెదిరింపులు వచ్చాయి. గౌరీ స్ప్రాట్‌తో ఆయన మూడో వివాహం నేపథ్యంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వ్యక్తి ఒకరు సోషల్‌ మీడియాలో బెదిరించారు. ఆ బెదిరింపులకు ఇప్పటి ఘటనకు సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus