బిగ్ బాస్4: ఈరోజు ఎపిసోడ్ లో చిచ్చుపెట్టేది ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అందులోనూ హౌస్ మేట్స్ ఒకరి గురుంచి మరొకరు చెప్పమన్నప్పుడు ఎన్నో కారణాలు చెప్తారు. చిన్న చిన్న విషయాలని కూడా ఎత్తిచూపిస్తుంటారు. ఇదే బిగ్ బాస్ హౌస్ లో ఉండే మజా. అయితే, ఇప్పుడు సీజన్ 4 లో జంటలుగా విడిపోయిన హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్కుంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చుకున్నారు. కన్ఫెషన్ రూమ్ లో జరిగిన ఈ టాస్క్ లో ఏ జంటకి ఏ టైటిల్ వచ్చింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఫస్ట్ అభిజిత్ అండ్ హారిక ఇద్దరూ జంటగా వెళ్లి – అమ్మరాజశేఖర్ కి లాస్య జంటకి గజిబిజి జంట అనే టైటిల్ ఇచ్చారు. తర్వాత సోహైల్ ఇంకా మెహబూబ్ ఇద్దరూ కలిసి అరియానాకి అవినాష్ కి బద్దకస్తుల జంట అనే బోర్డ్ ఇచ్చారు. ఇలాగే మోనాల్ అఖిల్ ఇద్దరూ కలిసి మెహబూబ్ కి సోహైల్ కి కలిపి అబద్ధాలకోరు జంట అనే బోర్డ్ పెట్టారు. ఇక్కడే చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిజానికి ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచీ వీళ్ల నలుగురు ఒక గ్రూప్ గా ఉన్నారు. ఇప్పుడు అబద్దాల కోరు జంట అనే బోర్డ్ ఇచ్చినపుడు సోహైల్ అండ్ మెహబూబ్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరం.

తర్వాత అరియానా అండ్ అవినాష్ ఇద్దరూ కలిసి మోనాల్ – అఖిల్ పెయిర్ కి అంహకారుల జంట అనే బోర్డ్ టైటిల్ పెట్టారు. ఇక లాస్ట్ గా వచ్చిన అమ్మరాజశేఖర్ అండ్ లాస్యలు ఇద్దరూ కలిసి అభిజిత్ కి హారికకి జీరో టాలెంట్ జంట అనే బోర్డ్ పెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ల దృష్టిలో జీరో టాలెంట్ అయినా కూడా బయట ఆడియన్స్ దృష్టిలో మాత్రం వీరిద్దరూ హీరోజంటగానే ప్రూవ్ అవుతున్నారు.

మరో విషయం ఏంటంటే, అమ్మరాజశేఖర్ – లాస్య ఇద్దరూ కలిసి వచ్చినపుడు వారికి ఆప్షన్ గా ఒకే ఒక బోర్డ్ ఉంది. మరి ఆ బోర్డ్ ఉంది కదా అని పెట్టేశారా..? లేదా ఏదైనా సాలిడ్ రీజన్ చెప్తారా అనేది ఈరోజు ఎపిసోడ్ లో ఆసక్తికరం. అంతేకాదు, దీనివల్ల ఎవరెవరికి క్లాష్ అవుతుంది. హౌస్ లో చిచ్చుపెట్టేది ఎవరు అనేది కూడా ఇంట్రస్టింగ్ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus