The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

[Click Here For Detailed Review]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మిడ్ రేంజ్ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు మారుతీ కాంబినేషన్లో ‘ది రాజాసాబ్’ (The RajaSaab) అనే పాన్ ఇండియా సినిమా రూపొందింది.సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్.. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. అత్యంత కీలక పాత్రలో సంజయ్ దత్ కూడా నటించారు.తమన్ సంగీత దర్శకుడు.టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

The RajaSaab Twitter Review

ట్రైలర్, రెబల్ సాబ్ సాంగ్, సహానా సాంగ్ వంటివి జస్ట్ ఓకే అనిపించాయి. అయితే సెకండ్ ట్రైలర్, నాచే నాచే వంటి సాంగ్స్ సినిమాకి బజ్ ఏర్పడేలా చేశాయి.తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకి జీవో ఆలస్యం కావడంతో.. ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.

వారి టాక్ ప్రకారం..’ది రాజాసాబ్’ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుందట. మొదట్లోనే హర్రర్ ఎలిమెంట్స్ తో అటెన్షన్ డ్రా చేస్తుందట. తర్వాత కాసేపటికి ప్రభాస్ ఓ ఫైట్ సీక్వెన్స్ తో ఇంట్రో ఇస్తారట. ఫ్యాన్స్ కి ఆ ఫైట్ మంచి కిక్ ఇస్తుంది అంటున్నారు. అటు తర్వాత హీరోయిన్స్ ఇంట్రో సీన్లు అలాగే కొన్ని కామెడీ సీన్స్ వస్తాయట. హీరోయిన్ మాళవికకి సైతం ఓ ఫైట్ సీక్వెన్స్ పెట్టారట.

హీరో, హీరోయిన్ మాళవిక అండ్ గ్యాంగ్..తో పాటు హీరో బంగ్లాలోకి ఎంటర్ అయ్యే సీక్వెన్స్ తో ఇంటర్వెల్ కార్డు పడుతుందని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో హర్రర్ ఎలిమెంట్స్ వస్తాయట. ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా అందరినీ కట్టిపడేస్తుంది అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

 

 

 

‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus