Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మారి దర్శకత్వంలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా. టీజర్ ఇంప్రెస్ చేసింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘భీమవరం బాలమా’ సాంగ్ ఆకట్టుకుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Anaganaga Oka Raju Trailer

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 52 సెకన్ల నిడివి కలిగి ఉంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. నవీన్ పోలిశెట్టి మార్క్ నాన్ స్టాప్ కామెడీ పంచ్..లతో ట్రైలర్ ని నింపేశారు. అతని కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ‘నా ప్రేమ కూకట్ పల్లి ఫ్లై ఓవర్ లాంటిది అక్కడ యూటర్న్ లేదు’ ‘ప్రశాంతంగా ఉండేవాడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చారు కదరా’ వంటి డైలాగులు ఇంప్రెస్ చేశాయి.

అంతేకాదు తొలిసారి యాక్షన్ మోడ్లోకి కూడా దిగాడు నవీన్ పోలిశెట్టి. ఫైట్ సీక్వెన్సుల్లో కూడా గ్రేస్ చూపించే ప్రయత్నం చేశాడు.గోదావరి రాజుల తరహా పాత్రలో అతను కనిపిస్తున్నాడు. అతనికి విలన్ వల్ల వచ్చిన సమస్య ఏంటి అనేది కాన్ఫ్లిక్ట్ పాయింట్ గా తెలుస్తుంది. అక్కడక్కడా నాని ‘పిల్ల జమిందార్’ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags