పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే.. హడావిడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోటీగా ఎన్ని సినిమాలు ఉన్నా.. ఎక్కువ థియేటర్లు ‘ది రాజాసాబ్’ కే కేటాయిస్తారు అని అంతా అనుకోవడం సహజం. కానీ ‘ది రాజాసాబ్'(The RajaSaab) విషయంలో అలాంటి హడావిడి, సందడి కనిపించడం లేదు. ఎంత పెద్ద హీరో నటించిన సినిమా అయినా.. పెద్ద నిర్మాతతో ఆ సినిమా చేస్తేనే దాని లెవెల్ వేరేలా ఉంటుంది.
కానీ పెద్ద హీరో చిన్న లేదా మిడ్ రేంజ్ నిర్మాతతో సినిమా చేస్తే.. దానికి దక్కాల్సిన గౌరవం దక్కదు. ఈ విషయం ‘ది రాజాసాబ్’ తో మరోసారి ప్రూవ్ అవుతుంది అని చెప్పాలి.ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఆయన సోలో నిర్మాతగా సినిమాలు చేస్తున్నప్పటి నుండి వరుస ప్లాపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎట్టకేలకు ‘మిరాయ్’ తో ఓ బ్లాక్ బస్టర్ కొట్టారు. అది తీసేస్తే అన్నీ ప్లాపులే.
అయితే ‘రాజాసాబ్’ హిట్ అయితే కనుక ఇప్పటివరకు వచ్చిన నష్టాలను తీర్చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఏరి కోరి ‘ది రాజాసాబ్’ ని 2026 సంక్రాంతికి తీసుకొస్తున్నారు. కానీ ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరకడం లేదు. దక్కిన థియేటర్లు కూడా సరైనవి కాదు. మంచి థియేటర్లు అన్నీ ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాలకి లాక్ చేశారు. బయ్యర్స్ కూడా ‘ది రాజాసాబ్’ పై నమ్మకంగా లేరు.
అందుకే ఈ సినిమాకి ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయలేదు అనేది ఇన్సైడ్ టాక్. టి.జి.విశ్వప్రసాద్ పంపిణీ విషయంలో అవగాహన లేదు. అందుకే ‘ది రాజాసాబ్’ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. సినిమాకి స్ట్రాంగ్ మౌత్ టాక్ వస్తే తప్ప.. ‘ది రాజాసాబ్’ సంక్రాంతి బరిలో స్ట్రాంగ్ గా నిలబడటం చాలా కష్టం. అప్పుడు బాక్సాఫీస్ భారం అంతా ప్రభాస్ స్టార్ డమ్ పైనే ఆధారపడి ఉంటుంది.