కొన్నాళ్ల వరకు ఇయర్ ఎండింగ్‌లో రెండు నెలలు సినిమాలు పెద్దగా వచ్చేవి. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు ఈ సీజన్‌లో కనిపించేవి కావు. అయితే ఏమైందో ఏమో గత రెండు, మూడేళ్లుగా ఆ టైమ్‌ను కూడా బెస్ట్ సీజన్‌గా మార్చేశారు. అదే క్రిస్మస్ సీజన్. ఇయర్ ఎండింగ్‌లో సినిమా తీసుకొచ్చి ఆ సంవత్సరాన్ని ఘనంగా ముగించే పనిలో ఉంటున్నారు మన హీరోలు. అలా ఈ ఏడాది కూడా క్రిస్మన్ పండగకు మంచి మంచి సినిమాలు క్యూ కట్టాయి. దీంతో ఈసారి మెర్రీ క్రిస్మస్ ఎవరికి అవుతుందో అనే చర్చ మొదలైంది.
క్రిస్మస్ బరిలో వస్తున్న మొదటి సినిమా నాని ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల టీమ్ ప్రకటించింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల కథతో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ పాత్ర కీలకంగా ఉంటుంది అని చెబుతున్నారు. ఇటీవల టీజర్‌లో నానిని… మృణాల్ నాన్న పిలవడంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది.
బరిలో దిగుతున్న రెండో చిత్రం వెంకటేశ్ ‘సైంధవ్’. ‘హిట్’ సినిమాలతో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని టాక్. డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేస్తారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రధారి. ఈ సినిమా వెంకీకి 75వ సినిమా కావడంతో గమనార్హం.
డిసెంబర్ 22న సుధీర్ బాబు ‘హరోం హర’ను కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘ఫస్ట్ ట్రిగ్గర్’ పేరుతో విడుదల చేసిన వీడియోకు మంచి పేరొచ్చింది. ‘‘అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు. కానీ, ఇది యాడెడో తిరిగి నన్ను పట్టుకుంది’ అనే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. మాస్ మసాలా యాక్షన్ మూవీ అని వీడియో లుక్ చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ బరిలోకి నితిన్ కూడా వచ్చాడు.
‘ఎక్స్‌ట్రా’ … ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని సమాచారం. ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. హీరో పాత్ర చిత్రణ ‘కిక్’ సినిమాలో రవితేజను పోలి ఉంటుంది అని చెబుతున్నారు. మరి వీరిలో ఎవరు ప్రేక్షకుల్ని అలరించి మెర్రీ క్రిస్మస్ (Christmas) చెబుతారో చూడాలి.
హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్