Anasuya: ప్రమోషన్లకి డుమ్మా, నిర్మాతని టెన్షన్ పెడుతున్న అనసూయ..!

  • April 18, 2022 / 05:06 PM IST

సినిమా మొదటి రోజు టాక్ ను బట్టి.. ఫలితం ఆధారపడి ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు. ఏ సినిమాకైనా ఇంతే..! అయితే విడుదల రోజున జనాలని థియేటర్ కు రప్పించాలి అంటే ప్రమోషన్ చాలా అవసరం. ఎంత బాగా ప్రమోషన్ చేస్తే ఆ సినిమా పై అంత క్రేజ్ పెరుగుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరుగుతాయి.ఇదిలా ఉండగా.. చిన్న సినిమాలకైతే కాస్త పేరున్న ఆర్టిస్ట్ లను తీసుకునేది ఇలా ప్రమోషన్లకు ఉపయోగపడతారనే..!

Click Here To Watch NOW

అయితే కొంతమంది క్రేజీ నటీనటులు మాత్రం చిన్న నిర్మాత‌ల్ని చులకనగా చూస్తూనే వారి ఆశ‌ల‌ పై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు.ఈ లిస్ట్ లో అన‌సూయ కూడా ఉందనేది లేటెస్ట్ టాక్. ఆమె ఓ పక్క బుల్లితెర పై నటిస్తూనే మరో పక్క పెద్ద సినిమాల్లో, మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాల్లో నటిస్తూనే `ద‌ర్జా` అనే చిన్న సినిమాలో కూడా నటించింది.

సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి అన‌సూయ‌నే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. సినిమా ఈమె పాత్ర పైనే ఆధారపడి నడుస్తుందట. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్న పాత్ర ఇది. అయితే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం ఈమె రావడం లేదు. అన‌సూయ‌తో ప్రమోషన్ చేయిస్తే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని నిర్మాత‌ అనుకున్నాడు. భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేసాడు.కానీ అన‌సూయ మాత్రం స్పందించడం లేదు. చిత్ర బృందానికి స‌హ‌కరించడం లేదు అని తెలుస్తుంది.

ఈ మధ్యనే ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది.కానీ దీనికి అనసూయ హాజరు కాలేదు. మరొపక్క రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. దీంతో నిర్మాత కు టెన్షన్ మొదలైంది. అదే `పుష్ఫ ` వంటి సినిమలో చిన్న పాత్ర పోషించినా… ఆమె తెగ ప్రమోషన్లు చేసింది. అలాంటి పెద్ద సినిమాలకి ఏమో కానీ ఇలాంటి చిన్న సినిమాలని మాత్రం ఈమె పట్టించుకోకపోతే అనసూయ పై మరింత విమర్శల వర్షం కురిసే ప్రమాదం ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus