ఒక ప్రాజెక్ట్ కి ప్రకటించిన తరువాత హీరోయిన్లు మారడం సహజం. అయితే ఒక్కసారి సెట్స్ పైకి వెళ్లాక మాత్రం హీరోయిన్లు తప్పుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే పదే పదే హీరోయిన్ మారుతూ ఉంటే మాత్రం చాలా అనుమానాలు వస్తాయి. ‘డీజే టిల్లు’ సీక్వెల్ విషయంలో ఇదే జరుగుతోంది. మొదట దర్శకుడు మారాడు. ఆ విషయాన్ని జనాలు లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించాల్సిన హీరోయిన్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.
ముందు శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. ఆ తరువాత ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. కొద్దిరోజులకు ఆమె కూడా డ్రాప్ అయింది. నెక్స్ట్ మడోనా సెబాస్టియన్ ను అడిగారు. ఆమెపై లుక్ టెస్ట్ కూడా జరిగింది. క్యారెక్టర్ కి అంతగా సూట్ కాదని భావించి నో చెప్పారట. అయితే అసలు టాక్ వేరేలా ఉంది. ‘డీజే టిల్లు2’ సినిమాలో ముద్దు సీన్లు చాలా ఉన్నాయని.. వాటిలో నటించడానికి ఇబ్బందవుతుందని ముందే గుర్తించి ఒక్కొక్కరుగా నో చెప్పారట.
ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్ గా ఎవరు కన్ఫర్మ్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఫస్ట్ పార్ట్ లో నటించిన నేహాశెట్టినే తీసుకోవచ్చు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు రాసుకున్న కథ ప్రకారం ఆమెని మెయిన్ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ లేదట. అందుకే కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారు.
రిలీజ్ డేట్ లాక్ చేసుకొని దానికి తగ్గట్లుగా షూటింగ్ ప్లాన్ చేద్దామనుకుంటే ఇప్పుడేమో హీరోయిన్ సెట్ అవ్వడం లేదు. ఈ సినిమా కోసం సిద్ధూ వేరే కమిట్మెంట్స్ కూడా వదులుకున్నారు. మరి ఈ సమస్యను ఎదుర్కొని సినిమాను ఎలా పూర్తి చేస్తారో చూడాలి!