ప్రభాస్ – రిలేషన్ షిప్… టాలీవుడ్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రభాస్ లవర్ ఎవరు? ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అంటూ ఏదో రకంగా, ఏదో విషయం చర్చకు వస్తూనే ఉంది. మొన్నీమధ్య వరకు అనుష్క శెట్టి అంటూ పేరు వినిపించింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి కృతి సనన్ పేరు వినిపించింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ గతంలో జరిగింది, ఇప్పుడూ జరిగింది. ఇదే టాపిక్ ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో కూడా వచ్చింది. అయితే టాపిక్ చర్చకు రావడం ఓకే.. కానీ దానిని పట్టుకొని సాగదీయడమే ఇబ్బందిగా మారింది అంటున్నారు.
ప్రభాస్ – కృతి సనన్ అంటూ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియలో చర్చ మొదలైంది. దానికి కారణం కృతి సననే అనే విషయం తెలిసిందే. ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ లాంటి వాడిని పెళ్లి చేసుకుంటా అంటూ.. ఏవేవో చెప్పింది కృతి మేడమ్. దాంతో బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మొత్తం మీడియా ఇదే వార్తలు రాసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్న గుర్తు వేసుకుంటూ సమాచారం వచ్చేసింది. నిజమా! అనే అనుమానం ఉండగానే.. ‘తూచ్ అలాంటిదేం లేదు.. మీరు ఓవర్ చేయకండి’ అంటూ కృతి మేడమ్ క్లారిటీ ఇచ్చేసింది.
అంతలా క్లారిటీ వచ్చిన విషయాన్ని మరోసారి గిచ్చి, రక్కి, గోకి, గీకి, పీకి పందిరేశాడు బాలయ్య. ప్రభాస్ అన్‌స్టాపబుల్‌కి వస్తే ఏవైనా తెలియని విషయాలు మాట్లాడతాడేమో అనుకుంటే.. తెలిసిన కృతి – అనుష్క విషయాన్నే చెప్పుకొచ్చారు. తెలిసిన విషయాన్ని ఆ తర్వాత బాగా పీకి, పీకి చిరాకు పుట్టించాడు బాలయ్య. ప్రభాస్ తన స్టయిల్లో వదిలేయండి బాబూ అన్నా బాలయ్య ఆగలేదు. ఆఖరికి రామ్‌చరణ్‌కి ఫోన్ చేసి కూడా అదే విషయం మీద చర్చ. దీంతో ఎందుకు అంతలా చర్చ రేపారు అనే డౌట్ మొదలైంది.
ప్రభాస్ – రిలేషన్ అనే పేర్లు వినిపిస్తే అనుష్క శెట్టి పేరు వినిపించేది ఇన్నాళ్లూ. అయితే ఇప్పుడు ఆ టాక్‌ను చెరిపేయడానికే బాలయ్య ఇలా కృతి సనన్ టాపిక్‌ను లాగి లాగి వదిలిపెట్టారు అంటున్నారు కొంతమంది నెటిజన్లు. మరి ఏది నిజమో, ఎందుకు ఈ చర్చ అనేది డిస్కషన్ రేపిన వాళ్లకే తెలియాలి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?