Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

  • September 19, 2025 / 04:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

‘కల్కి 2’ సినిమా నుండి ప్రముఖ నటి దీపిక పడుకొణె బయటకు వచ్చేసింది. మామూలుగా అయితే ఈ విషయం చాలా పెద్ద సెన్సేషన్‌ అని చెప్పుకోవాలి. కానీ ఆమె ఇటీవల కాలంలో ఎగ్జిట్‌ ఇచ్చిన రెండో పెద్ద సినిమా కావడంతో అంత ఆసక్తి లేకుండా దీనిపై చర్చ జరుగుతోంది. ఆ సినిమా నుండి బయటకు రావడానికి ఆమె చెప్పిన కారణాలే.. ఈ సినిమాకు కూడా వర్తిస్తాయి అని వార్తలు రావడమే దీనికి కారణం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఇప్పటికిప్పుడు షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం లేని ఈ సినిమా నుండి దీపిక తప్పుకుంది అని ప్రకటన ఎందుకు వచ్చినట్లు?

Deepika Padukone

‘కల్కి 2’ సినిమా గురించి ఇటీవల దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదు అన్నట్లుగా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని కీలక పాత్రధారులు ఇప్పుడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారని.. వారంతా ఫ్రీ అయ్యాక ‘కల్కి 2’ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దీనికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉందని ఓ అంచనా వేస్తున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘ది రాజా సాబ్‌’, ‘సలార్ 2’ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ అవ్వాలంటే చాలా టైమ్‌ పడుతుంది. ఇక కమల్‌ హాసన్‌ పరిస్థితి కూడా అంతే.

మరి ఎప్పుడో మొదలవ్వబోయే సినిమా గురించి ఇప్పుడు చర్చలు జరిగి దీపిక ఎందుకు సినిమా నుండి బయటకు వచ్చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. పోనీ ఆమెకు ఇలాంటి పాన్‌ ఇండియా సినిమాలు, సౌత్‌ సినిమాలు నటించడం ఇష్టం లేదు అని అనుకుంది అనుకుంటే.. అల్లు అర్జున్‌ – అట్లీ సినిమాలో నటిస్తోంది. అంటే ఆ సినిమా విషయంలో దర్శకుడు అట్లీ, నిర్మాణ సంస్థకు ఆమె ఎలాంటి రూల్స్‌ పెట్టలేదు అనైనా అనుకోవాలి. లేదంటే వాళ్లు ఆ ‘రూల్స్‌’కి ఓకే చెప్పారు అనైనా అనుకోవాలి. ఏంటా రూల్స్‌ అనేది మీకు తెలుసు.

Why deepika padukone exit from kalki 2

దీపిక తన పారితోషికాన్ని 25 శాతం పెంచిందని, తనతో పాటు వచ్చే సిబ్బందికి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో సదుపాయాలు కల్పించాలని కోరిందని ఓ టాక్‌ నడిపిస్తున్నారు. షూటింగ్‌కు రోజుకు 7 గంటలు మాత్రమే హాజరవుతానని కూడా కండీషన్‌ పెట్టిందట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. ఈ నిబంధనలు ఆమె అన్ని సినిమాలకు తప్పక పెడుతుంది. మరి అట్లీ – అల్లు అర్జున్‌ టీమ్‌కి కూడా ఇవే పెట్టిందట. ఒకవేళ పెట్టి ఉంటే ఇప్పుడొస్తున్న పుకార్లు నిజమే. అన్నట్లు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ పోస్ట్‌ చేశారు.

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కృష్ణుడి ఎంట్రీ సీన్‌ అది. ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..’ అని అశ్వ‌త్థామకు కృష్ణుడు చెప్పే డైలాగ్‌ ఉంది. దీన్ని షేర్‌ చేస్తూ ‘జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’ అని రాసుకొచ్చారు. ఇది ఎవరి కోసం రాశారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

 “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Kalki 2898
  • #Kalki 2898 AD

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

4 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version