Spirit – Deepika: ‘స్పిరిట్’ నుండి దీపిక ఔట్ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?
- August 22, 2026 / 02:50 PM ISTByFilmy Focus Desk
‘స్పిరిట్’ సినిమా నుండి దీపికా పడుకొణె తప్పుకున్న సందర్భంలో సోషల్ మీడియాలో, సినిమా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె బాలీవుడ్ హీరోయిన్ కావడం, భారీ పారితోషికం రకం కావడం, బాలీవుడ్ హీరోయిన్లు కొన్ని రకాల రూల్స్ పాటించడం లాంటి అంశాల నేపథ్యంలో ‘స్పిరిట్’ నుండి ఆమె బయటకు వచ్చేసిన విషయంలో చాలా రకాల మాటలు వినిపించాయి. ఒక దశలో ఆమె ఆ సినిమా కథను లీక్ చేసేస్తోంది అనే మాట కూడా వినిపించింది.
Spirit – Deepika
అయితే, ఈ మొత్తం విషయంలో ఎక్కడా దీపికా పడుకొణె కానీ, దర్శకనిర్మాత సందీప్ రెడ్డి వంగా కానీ ఎక్కడా స్పందించలేదు. సోషల్ మీడియాలో ఇరు వర్గాలు కొన్ని పోస్టులు వేసి కౌంటర్లు ఇచ్చుకోవడం తప్ప ఎక్కడా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తొలిసారి స్పందించారు. ‘స్పిరిట్’ సినిమా నుండి బయటకు వచ్చేయడానికి మొత్తం కారణాలను క్లియర్‌గా చెప్పుకొచ్చారు. అలాగే ఓ ప్రశ్నకు/ చర్చకు దారి తీశారు.

‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి దీపికా పడుకొణె రెమ్యూనరేషన్ విషయంలో కొన్ని డిమాండ్లు చేశారు. అలాగే సినిమా షెడ్యూల్స్, షూటింగ్స్ విషయంలో కొన్ని ప్రిఫరెన్స్‌లు చెప్పారు. అంతేకాకుండా ‘స్పిరిట్’ సినిమా లాభాల్లో పది శాతం షేర్ కావాలని అడిగారు. వాటికి మేం అంగీకరించలేదు. దాంతో ఆమె సినిమాకు దూరమయ్యారు అని ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. అలా ప్రొఫెషనల్, ఫైనాన్సియల్ ఇష్యూస్ వల్ల ఆమె బదులు సినిమాలోకి త్రిప్తి డిమ్రీ వచ్చిందని చెప్పారు.
అయితే, ఇక్కడ ఒకటే ప్రశ్న. సినిమాల్లో హీరోలు – హీరోయిన్లకు సమానమైన ప్రాధాన్యం ఉండాలి అనేది దీపిక పడుకొణె సుదీర్ఘ వాదన. రెమ్యూరేషన్ విషయంలోనూ అంతే. ఈ నేపథ్యంలోనే ఆమె ‘స్పిరిట్’ టీమ్‌ని అలా అడిగారు. అయితే ఈ మొత్తం విషయంలో రియాక్ట్ అవ్వాల్సింది ప్రధాన ప్రొడ్యూసర్ టీసిరీస్. వారు కాకుండా డైరక్టర్ మాత్రమే రియాక్ట్ అయ్యారు. దీంతో అసలు సమస్య ఫైనాన్సియల్ ఇష్యూయేనా అనే డౌట్ అలానే ఉండిపోయింది.















