భయపడుతున్న ఎన్టీఆర్!!

Advertisement

ఎన్టీఆర్ మాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే., ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చిన్న వయసులోనే మాస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని దుమ్ము దులిపాడు మన జూనియర్. ఇదిలా ఉంటే ఆ మధ్య తాను పూర్తి మాస్ సినిమాలే చేయడం వల్ల మిగిలిన వర్గాలు తనను సరిగ్గా ఆదరించడం లేదు అని ఒకింత ఫీల్ అయ్యి క్లాస్ టచ్ ఇచ్చే సినిమాలు ట్రై చేశాడు. అందులో ఒకటి, రెండు, అరా…కొరా ఆడినా ఫలితాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఇక అదే క్రమంలో ఆయన సినిమాలను మాస్ ఫాన్స్ చూడటం తగ్గించేశారు. ఇక ఆ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చెయ్యాల అన్న సందిగ్ధంలో ఉన్న ఎన్టీఆర్ కు ఇప్పుడు కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ కలిసొచ్చింది. అసలైతే దర్శకుడి బ్యాక్ గ్రౌండ్ చూసి సినిమా అంతా మాస్ అనుకున్నారు అందరూ. కానీ దర్శకుడు మాత్రం ఈ చిత్రంలో స్టైలిష్ ఎన్టీఆర్ ను చూస్తారు, ఎమోషన్స్ పండించిన ఎన్టీఆర్ ను చూస్తారు అని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫాన్స్ మొత్తం ఒకింత డైలమాలో పడ్డారు. ఇప్పటికే నాన్నకు ప్రేమతో సినిమా రిసల్ట్ అభిమానులను ఇబ్బందులకు గురి చేసింది. 50కోట్ల క్లబ్ లో అయితే చేరింది కానీ అనుకున్నంత విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న జనతా గ్యారేజ్ కూడా అలానే జరిగితే ఎన్టీఆర్ ఫాన్స్ తట్టుకోలేరు. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మాస్ మరియు క్లాస్ పల్స్ పూర్తిగా తెలిసిన దర్శకుడు కదా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus