నాగ్ ఇమేజ్ డ్యామేజ్!!!

కొన్ని సార్లు కొందరు హీరోలు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, వారు తీసుకునే భాద్యతల వల్ల పాపం అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే అప్పటివరకూ వారికి ఉన్న కాస్త ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా, వారి అండతో తెరకెక్కిన చిత్రం ‘పడేసావే’. ఒకటి కాదు…రెండు కాదు దాదాపుగా నెల రోజుల బట్టి నాగ్ ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్నాడు. తనకు తెలిసిన పద్దతుల్లో అనుకున్నదానికన్నా ఎక్కువగా ప్రమోషన్ చేశాడు.

ఇక సినిమా గురించి సైతం సినిమా చాలా బాగా వచ్చింది అని, మంచి కధ, కధనం అంతా బావున్నాయి అని ప్రమోట్ చేశాడు. కట్ చేస్తే మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డమాల్ మనిపించింది. సినిమా బాగోకపోవడం, అసలు కధ, కధనం సరైనవి కాకపోవడం, ఇలా అన్ని విషయాల్లో సినిమా చాలా దారుణంగా ఉండడంతో నాగ్ పై మండిపడుతున్నారు ప్రేక్షకులు.

ఈ సినిమానా నాగ్ దాదాపుగా నెల నుంచి ప్రమోట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలు ప్రమోట్ చేసి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు అంటూ నాగ్ అభిమానులు సైతం మండి పడుతున్నారు. ఏది ఏమైనా..నాగ్ ఈ సినిమా దర్శకురాలి కోసం చేసిన ప్రమోషన్ ఇప్పుడు అసలుకే మోసం తెచ్చిపెట్టడంతో పాపం నాగ్ చేసేది ఏమీ లేక మీడియా ముందుకు రావడంలేదు అని సినీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus