పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కానీ సినిమాకి అన్నీ ఆటంకాలే వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అవ్వడానికి చాలాకాలం తీస్కున్న తర్వాత సడెన్ గా సీన్ లోకి బోనీకపూర్ ఎంటర్ అయ్యాడు. పింక్ రీమేక్ కి భారీగా ఖర్చుపెట్టాల్సి రావడంతో వకీల్ సాబ్ కోసం ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్ బరిలోకి దిగారు. ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒకరు. ఫస్ట్ టైమ్ మా బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తున్నాం అని ఎనౌన్స్ చేసిన ఆనందం కొన్నాళ్లు కూడా మిగల్లేదు. కరోనా దెబ్బకి షూటింగ్ లాస్ట్ లో ఆగిపోయింది. కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ తప్ప మిగతా సినిమా అంతా కంప్లీట్ చేసేశారు. దీంతో ఎన్నో ఓటీటీ సంస్థలు ఈ సినిమాని అవుట్ రేట్ కి కొనేయాలని చూశాయి. అలాగే ఫ్యాన్సీ రేటులో దిల్ రాజుకి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ తెరిచే వరకూ కూడా వెయిట్ చేసి ఇప్పుడు ఎట్టకేలకి ఏప్రిల్ 9వ తేదిన లాక్ చేశారు.
డేట్ అయితే లాక్ చేశారు కానీ, ఇప్పటివరకూ ప్రమోషన్స్ మాత్రం లేవనే చెప్పాలి. టీజర్ వచ్చి ట్రెండింగ్ లో ఉన్నా కూడా ఎక్కడా దీనిగురించి ప్రస్తావించడం లేదు మూవీ టీమ్. అలాగే, మరోవైపు చిన్న సినిమాలకి సైత్ పబ్లిసిటీతోనే ప్రీ రిలీజ్ మార్కెట్ ని పెంచుకుంటూ పోతుంటే, దిల్ రాజు టీమ్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగానే ఉంది. వకీల్ సాబ్ కి ప్రమోషన్స్ అవసరం లేదనుకుంటోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రీసంట్ గా తమన్ మ్యూజిక్ అప్ డేట్స్ ఇస్తానంటూ ముందుకొచ్చి ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చాడు. అయినా కూడా ఫ్యాన్స్ సినిమా ప్రమోషన్స్ ఇవ్వడంలేదని గుస్స అవుతున్నారు. ప్రమోషన్స్ ఎక్కడ సాబ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బోనీకపూర్ రాజమౌళి ఇచ్చిన ఝలక్ నుంచి ఇంకా తేరుకున్నట్లుగా లేడు. అందుకే ఈసినిమాపై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు. దిల్ రాజు అండ్ టీమ్ కూడా పెద్దగా ఆసక్తిని చూపిస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.
మరి ఇప్పటికైనా పవన్ రేంజ్ కి తగ్గట్లుగా పబ్లిసిటీని ప్లాన్ చేస్తేనే సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుందని, మార్కెట్ కూడా గట్టిగా అవుతుందని అంటున్నారు. అలాగే, ఓవర్సీస్ బిజినెస్ కూడా వకీల్ సాబ్ పైనే ఎన్నో ఆశలని పెట్టుకున్నారు. వకీల్ సాబ్ సాధించే కలక్షన్స్ ని బట్టీ ఇప్పుడు ఓవర్సీస్ లో రానున్న పెద్ద బడ్జెట్ సినిమాలు భవిష్యత్ ఆధారపడి ఉంది. మరి దిల్ రాజు అండ్ టీమ్ ఈ వకీల్ సాబ్ కోసం ఏం ప్లాన్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిరకం. అదీ విషయం.