‘బిగ్ బాస్5’ గత సీజన్లకంటే కూడా రెట్టింపు జోష్ తో ప్రారంభమైంది.ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో మొదలైంది.ఇందులో ఫీమేల్ కంటెస్టెంట్లు తక్కువగానే ఉన్నారు. కానీ అదేంటో ముందుగా వాళ్ళే ఎలిమినేట్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. లహరి, హమీద, ఉమాదేవి, శ్వేత వర్మ, సరయు.. నిన్న ప్రియా. హౌస్ లో ఇప్పుడున్న ఫీమేల్ కంటెస్టెంట్లు కాజల్, అని, సిరి, ప్రియాంక సింగ్ మాత్రమే.
‘బిగ్ బాస్5’ ప్రారంభమయ్యి ఇంకా 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆడవాళ్ళందరినీ బయటకి తోలేస్తే ఇక ‘బిగ్ బాస్’ లో గ్లామర్ ఎక్కడుంటుంది. కుర్ర కారు ‘బిగ్ బాస్’ చూసేది చాలా వరకు గ్లామర్ కోసమే. ఇప్పుడు అదే కరువైతే టి.ఆర్.పి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతే కాదు గత 4 సీజన్లలోనూ అబ్బాయిలే విజేతలు అయ్యారు.ఆడవాళ్ళని విజేతలు కానివ్వరా అంటూ చాలా మంది మహిళలు మండిపడ్డారు. అందులో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు.
అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. ‘బిగ్ బాస్’ ఇలా ఆడవాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఆ మహిళల్ని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. అప్పుడు వివాదాలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడున్న ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా మంచి మంచి టాస్కులు ఇస్తే బెటర్.