అక్కినేని వారి వేడుకలో సమంత మిస్సింగ్.. కారణం..?

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డుల వేడుకను నవంబర్ 17న(నిన్న) సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా.. ఈ వేడుక జరిగింది. ఇక ఈ ఏడాదికి గాను సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సీనియర్ టాప్ హీరోయిన్స్ అయిన రేఖా, దివంగత నటి అతిలోకసుందరి అయిన శ్రీదేవికి… అక్కినేని నేషనల్ అవార్డ్ ఇవ్వడం విశేషం.ఇక ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా… పలువురు దర్శక నిర్మాతలు అలాగే లక్ష్మీ మంచు, నిహారిక వంటివారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అక్కినేని మూడు తరాల హీరోలు కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే అక్కినేని నాగార్జున పెద్ద కోడలు సమంత మాత్రం హాజరుకాకపోవడంతో అభిమానులు నిరుత్సాహ పడ్డారు. అసలు సమంత ఎందుకు హాజరుకాలేదని డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. సమంత నటిస్తున్న 96 చిత్రం షూటింగ్ కూడా పూర్తయినప్పటికీ సమంత హాజరుకాలేదు. అయితే ఓ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తుండడంతో షూటింగ్ లో బిజీగా ఉందట. అందుకే ఈ వేడుకకి హాజరుకాలేదని తెలుస్తుంది. తాను ఈ వేడుకకి మిస్ అయినందుకు బాధపడుతున్నట్టు కూడా తన సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టింది సమంత.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus