Samantha: స్టార్‌ హీరోలతో సమంత కనిపించి చాలా రోజులైంది.. కారణమేంటి?

ఆ రోజుల్లో అంటే ఏఎన్నార్‌, ఎన్టీఆర్ కాలంలో కొంతమంది హీరోయిన్ల విషయంలో బాగా కఠువుగా ఉండేవారు అంటారు. ఎవరు, ఎందుకు అలా చేసేవారు అనేది తెలియదు కానీ.. ఆ హీరోయిన్‌ ఉంటే మేం సినిమా చేయం అని అనేవారట. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం చూడలేం. అయితే చెప్పకుండానే పక్కన పెట్టేస్తారా? ఏమో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ను చూస్తుంటే ఈ విషయంలో ‘అవునేమో’ అనిపిస్తోంది. ఆమెనే సమంత. కావాలంటే చూడండి అనారోగ్యం నుంచి కుదురుకున్నాక ఆమె పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదు.

ఛ.. ఊరుకోండి ఆమెను దూరం పెట్టడం ఏంటి? ఆమెనే సగటు కమర్షియల్‌ సినిమాలు చేయడం లేదు అనే మాట మీరు అనొచ్చు. అలా కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఎంతో పేరొస్తుంది అనుకునే కొన్ని పాత్రలు సైతం సమంత వైపు చూడటం లేదు అనేది ఇక్కడ లెక్క. అంతెందుకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలు తీసుకోండి.. ఆయన సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర కూడా బలంగానే ఉంటుంది. గతంలో ఆయన కూడా సమంతను చాలా సినిమాల్లోకి తీసుకున్నారు. కానీ ‘గుంటూరు కారం’ విషయంలో ఆమెను అడగలేదు.

పోనీ.. ‘గుంటూరు కారం’ అనుకుంటున్నప్పుడు పూజా హెగ్డే మంచి జోరు మీదుంది కాబట్టి ఆమెను తీసుకున్నారు అనుకుందాం. మరి ఆ సినిమాలో హీరోయిన్‌ను తప్పుకున్నప్పుడు/ తప్పించినప్పుడు సమంత ఎందుకు డిస్కషన్‌లోకి రాలేదు అనేది విషయం. ఇప్పుడే కాదు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో కథానాయికల ఎంపిక సమయంలో సమంత పేరు అస్సలు చర్చలోకి రావడం లేదట. ఆమెతో ఎన్నో హిట్లు ఇచ్చిన దర్శకులు కూడా ఇలానే ఉన్నారట.

పోనీ (Samantha) సమంత గ్లామర్‌ రోల్స్‌లో నటిస్తే ఫ్యాన్స్‌ యాక్సెప్ట్‌ చేయరా అంటే ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ అంటే జనాలు ఎగిరి గంతేసి ‘ఉ’ అన్నారు. సో.. ఆమె అయినా నో అనుండాలి, వీళ్లయినా అడగ్గకుండా ఉండాలి. ఇదంతా చూస్తుంటే సమంత – స్టార్‌ హీరోల కాన్సెప్ట్‌లో గ్యాప్‌ పెరుగుతోందా అనేది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus