సినిమాను రెండు ముక్కలు చేస్తున్నాం.. దీనిని అత్యంత భారీ ప్రచారంగా వాడుకున్నారు రాజమౌళి అండ్ సుకుమార్. ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాల విషయంలో ఈ టాపిక్ మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగా సినిమా జనాలు కూడా బాగా ఆసక్తి చూపించారు. అయితే ప్రశాంత్ నీల్ ఆ పని ఎందుకు చేయడం లేదు? నిజానికి ఆయన గతంలో చేయని పని కూడా కాదు ఇది. ఇదంతా ‘సలార్’ సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం.
ఈ సినిమాను రెండు పార్టుల్లో తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది కానీ కన్ఫామ్ కావడం లేదు. ‘సలార్’ సినిమా అనుకున్నదాని కంటే పెద్దగా అయిపోయిందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు విలన్లు వచ్చారు అని కూడా చెప్పుకొచ్చారు. రెండు పార్టుల సంగతి చెప్పకపోయినా ఇద్దరు విలన్ల మాట అయితే చెప్పారు. అలాంటి మరి రెండో విలన్‌కి హీరో ఎవరు అనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మేం చెబుతున్నది కూడా ఆ విషయమే.
జగపతి బాబుకు హీరో ఎవరో చెప్పారు కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్‌కి హీరో ఎవరు అనేది చెప్పలేదు. గత కొన్ని రోజులుగా ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. ‘సలార్’ సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. అయితే తొలి పార్టుకి సంబంధించి ఫుల్ ఫుటేజ్ రెడీ అయిపోయిందట. ఎడిట్ టేబుల్ మీద కుస్తీలు కూడా మొదలయ్యాయి అని చెబుతున్నారు. యాక్షన్ డ్రామాకు సంబంధించి బయటకు వచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి కూడా.
అయితే ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ రెండో ప్రభాస్ గురించి ఎక్కడా మాట్లాడటం లేదేంటి అనేదే ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో ఏమైతోంది నీల్.. త్వరగా చెప్పండి అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పేరు సలార్ అంట. అయితే కొడుకు దేవా అని అంటున్నారు. జగపతిబాబు పాత్రకు సలార్ హీరో అయితే, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు హీరో దేవా అంట. సలార్ లుక్ రగ్డ్గా ఉండగా, దేవా ఫుల్ స్టైలిష్‌గా ఉంటాడట. ఈ లుక్‌ని దాచి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారని టాక్.