చైతూని వదిలి వెళ్ళడానికి బాధపడుతున్న సమంత
- June 16, 2017 / 07:04 AM ISTByFilmy Focus
యువ సామ్రాట్ నాగచైతన్య, క్యూట్ బ్యూటీ సమంత నిశ్చితార్ధం తర్వాత మరింత దగ్గరయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. వీరిద్దరూ అక్టోబర్ ఆరవ తేదీన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే అప్పటి లోపున ఇద్దరు పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయి. అందుకోసమేనా విడివిడిగా ఉండాలి. తమిళంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విజయ్ 51 సినిమా షూటింగ్ నిమిత్తం నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు బయలు దేరాలి. కానీ అన్ని రోజులు చైతూని విడిచి ఉండలేనని సమంత తనదైన శైలిలో చెప్పింది. నాగచైతన్య గుండెలపై నిద్రిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేస్తూ .. “ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లాలి. ఒక సుదీర్ఘమైన షెడ్యూల్ కోసం వెళ్లటానికి ముందు.. అసలు నేనెందుకు వెళ్లాలో మూడు కారణాలు చెప్పండి?” అంటూ తనకు తానే ప్రశ్న వేసుకుంది.
“వర్షం పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతున్న వేళ.. ‘నేను అనారోగ్యానికి గురవుతానేమో?, అసలు నా విమానం టేకాఫ్ అవుతుందా?.. ప్లీజ్ నన్ను వెళ్లనివ్వొద్దు” అంటూ పోస్ట్ చేశారు. చైతూ మీద తనకున్న ఇష్టాన్ని.. అతన్ని వదిలి వెళ్లలేకపోవటాన్ని కవితాత్మకంగా చెప్పిన పోస్ట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. దీని ద్వారా సమంతలో మంచి నటి మాత్రమే కాదు కవియిత్రి కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















