Bigg Boss 7: ‘బిగ్ బాస్ 7’ గురించి ఆసక్తికర అప్డేట్..!

  • May 17, 2023 / 10:52 AM IST

నార్త్ లో ప్రేక్షకాదరణ పొందిన ‘బిగ్ బాస్’.. సౌత్ లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘బిగ్ బాస్’ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆల్రెడీ 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. అన్ని సీజన్లకు టి.ఆర్.పి రేటింగ్లు అదిరిపోయాయి. అయితే ‘బిగ్ బాస్ 6’ కి మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు అని ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్ మొదలవ్వడం కూడా కొంత టీవీ సిరీస్ ల పై ప్రభావం చూపినట్టు స్పష్టమవుతుంది.

ఇక బిగ్ బాస్ 3 నుండి నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నాడు. 7వ సీజన్ కు నాగ్ సముఖంగా లేడు అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ‘బిగ్ బాస్ 7’ ఉంటుందా? ఉండదా? అనే డిస్కషన్ కూడా మొదలైంది. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 2 నుండి అయితే ‘బిగ్ బాస్ 7’ ప్రారంభం కాబోతుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాకపోతే హోస్ట్ గా ఎవరు చేస్తారు అన్న విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. శని, ఆదివారాల ఎపిసోడ్స్ కోసం హోస్ట్..

ఒకరోజు షూటింగ్లో పాల్గొనాలి. మరి నాగార్జునే ఈ సీజన్ (Bigg Boss 7) ను కూడా హోస్ట్ చేస్తారా? లేక ఈసారి హోస్ట్ మారతాడా? అన్నది తెలియాల్సి ఉంది. ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. రెండో సీజన్ ను నాని హోస్ట్ చేశాడు. ఇక మూడో సీజన్ నుండి 6 వ సీజన్ వరకు నాగార్జునే హోస్ట్ చేయడం జరిగింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus