Naga Chaitanya: షూటింగ్ కంప్లీట్ అయినా ‘థాంక్యూ’ జాడ కనిపించడం లేదే..!

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. ‘జోష్’ తర్వాత సుమారు 13 ఏళ్ళ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో చైతన్య నటించిన మూవీ ఇది. చైతన్యకి ఓ హిట్టివ్వాలని నిర్మాత దిల్ రాజు చాలా కాలం నుండీ పరితపించి.. ఫైనల్ గా విక్రమ్ కుమార్ తో ‘థాంక్యూ’ చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Click Here To Watch NOW

రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ లు వంటి క్రేజీ భామలు ఈ మూవీలో నటిస్తున్నారు. బి.వి.ఎస్ రవి ఈ చిత్రానికి రైటర్ గా పని చేయడం జరిగింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని విడుదల చేయకుండా దాచి పెట్టారు. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయిందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని విడుదల చేయకుండా దాటడంతో సినిమా బాగా రాలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లేదా రీషూట్లు వంటివి చేయాలా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. మిడ్ రేంజ్ సినిమాలన్నీ జూన్ నెలలో కర్చీఫ్ వేసుకున్నాయి. కానీ ‘థాంక్యూ’ గురించి ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదు. బహుశా పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యాక ప్రమోషన్లు మొదలు పెడితే బాగుంటుంది అని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ఈ సినిమా ఫినిష్ చేసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, హీరో నాగ చైతన్య మరో వెబ్ సిరీస్ కూడా చేసుకుంటున్నారు.

నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం కూడా చేసేస్తున్నాడు. అంతేకాకుండా అతని హిందీ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టులో విడుదల కాబోతుంది. మరి ‘థాంక్యూ’ సినిమాకి మోక్షం ఎప్పుడో..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus