Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

రాజమౌళి పనితనం గురించి ఎవరికీ ఎలాంటి డౌట్‌ లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, సినిమా పరిశ్రమలో ఇలాంటి వారు మరొకరు లేరు అని అందరూ కొనియాడిన/ కొనియాడుతున్న దర్శక దిగ్గజాలు సైతం ఆయన పనితనాన్ని మెచ్చుకుంటున్నారు. దానికి కారణం ఆయన తీసిన సినిమాలు, ఆ సినిమాలను ప్రమోట్‌ చేసుకునే విధానం. ఈ రెండింటకీ ప్రపంచ సినిమా ఫిదా అయిపోతోంది. అలాంటి స్ట్రాటజీలు ఉన్న ఆయన.. ‘వారణాసి’ సినిమా కోసం కొత్త శైలిలో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారు అనిపిస్తోంది.

Varanasi

‘వారణాసి’ సినిమా ప్రచారం కోసం రాజమౌళి ఇప్పటివరకు చేయని పనులు చాలానే చేస్తున్నారు. ఇప్పటివరకు చూపించని వైవిధ్యం చూపిస్తూనే ఉన్నారు. సినిమా కథ లైన్‌ చెప్పేసి సినిమా పనులు మొదలుపెట్టే ఆయన.. ఈసారి అలాంటిదేం చేయలేదు. సినిమా వచ్చేంతవరకు సెట్స్‌ ఎలా ఉంటాయో చెప్పని ఆయన.. ఇప్పుడు సెట్స్‌ సత్తా రుచి చూపించేశారు. గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఎప్పుడూ లేనిది ఇదేంటి కొత్తగా.. అందులోనూ సినిమా విడుదలకు ఏడాది ముందుగా ఏంటి అని చూస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి, ముఖ్యమైనది ఇప్పటికే ఆ ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలోకి వచ్చేయడం. ఆ సినిమాకు పని చేస్తున్న హాలీవుడ్‌ టీమ్స్‌ కొన్ని వర్క్‌ ఫొటోలను బయటకు ఇచ్చేశాయి. రెగ్యులర్‌గా హాలీవుడ్‌ సినిమాలకు ఎలా చేస్తారో అలా చేసేశారు. దీంతో రాజమౌళి మొత్తం ఫొటోలు రిలీజ్‌ చేసేశారని సమాచారం.

మరో విషయం సినిమా విడుదలకు ఏడాది ఉన్నా.. అప్పటివరకు ఏదో విధంగా సినిమా పేరు మీడియాలో కనిపించాలని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాలని రాజమౌళి అండ్‌ కో అనుకుంటున్నారు. ప్రపంచ స్థాయి ప్రచారం, అందులోనూ హాలీవుడ్‌ సినిమాల స్థాయి ప్రచారం ఉండాలంటే తెలుగు సినిమాలకు చేసినట్లు అన్నీ ‘థియేటర్లలో లోపలే’ అంటే కుదరదు అని రాజమౌళికి అర్థమైనట్లు ఉంది. అందుకే ఈ ఎర్లీ ప్రచారం అని చెబుతున్నారు.

సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus