Adi Reddy: రివ్యూవర్స్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? డేంజర్ ఎవరికంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే, నిజంగా ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా ? రివ్యూవర్స్ లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితి. అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే ఓటింగ్ లో లీస్ట్ లో ఎవరున్నారంటే., బిగ్ బాస్ హౌస్ లో ఈవారం 10మంది నామినేషన్స్ లో ఉన్నారు.

వీళ్లలో రేవంత్, బాలాదిత్య, ఇనయ, ఇంకా కీర్తి ఈ నలుగురు సేఫ్ జోన్ లో ఉన్నారు. వీళ్ల నలుగురులో ఎప్పటిలాగానే రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వల్లే ఇప్పటివరకూ హౌస్ లో నెట్టుకొస్తున్నాడు. టాస్క్ ల్లో దుర్మార్గంగా, ఉన్మాదిలా గేమ్ ఆడుతున్నాడన్న కంప్లైట్, కోపం ఎక్కువ అనే కంప్లైట్ తప్ప మరేమీ రేవంత్ ఓటింగ్ ని ఆపట్లేదు. ఇక ఇనయ ని టార్గెట్ చేస్తుండటం వల్ల ఓటంగ్ బాగా పెంచుకుంది.

అలాగే బాలాదిత్య సిగరెట్ సింపతీ వర్కౌట్ అయ్యింది. అలాగే కీర్తి కూడా తన ఇమేజ్ కి సేఫ్ అవుతూనే వస్తోంది. ఇక మిగిలిన వాళ్లు ఈసారి డేంజర్ లో ఉన్నారు. ముఖ్యంగా గీతు రాయల్ కి లాస్ట్ వీక్ వరకూ సూపర్ ఓటింగ్ జరిగింది. కానీ, ఇప్పుడు లీస్ట్ లోకి వచ్చేసింది. ఆరుగురిలో ఫైమా, శ్రీసత్య, వీళ్లిద్దరూ సేఫ్ అవ్వొచ్చు. ఇక మిగిలింది కపుల్ అయిన రోహిత్ – మెరీనా ఇంకా రివ్యూవర్స్ గీతు – ఆదిరెడ్డి వీళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది.

అయితే , ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా ఎలిమినేషన్ ఉండదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే మెరీనా- ఆదిరెడ్డి , గీతు రోహిత్ ఈ నలుగురిలో ఒకరు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆదిరెడ్డి ఎలిమినేట్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus