ఒక సినిమాను రీమేక్ చేయడం చాలా కష్టం. ఉన్నది ఉన్నట్లు తీసేస్తే ‘మీరు చేసింది ఏముంది యాజ్ ఇట్ ఈజ్’ ఉంది కదా అనేస్తారు. ఇక ఏమన్నా మార్పులు చేసి తేడా కొడితే ‘ఉన్నది ఉన్నట్లు తీసినా బాగుండేది కదా’ అంటారు. ఇలాంటి డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ ప్రయాణాన్ని గతంలో బాగా చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఒకరు. రీసెంట్‌గా ‘మిస్టర్ బచ్చన్’తో (Mr. Bachchan) ఇబ్బంది పడినా.. ఆయన రీమేక్ స్కిల్స్‌ను పూర్తిగా బ్యాడ్ అనలేం.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఆయన చాలా ఏళ్లుగా తీస్తున్న (?) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)సినిమా కథను మరోసారి చెక్ చేసుకునే అవకాశం కల్పించాడు. తమిళంలో ‘తెరి’ (Theri).. తెలుగులో ‘పోలీసు’గా వచ్చిన సినిమాను మరోసారి తెలుగులో పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా తెరకెక్కిస్తున్నారు హరీశ్ శంకర్. ఒరిజినల్ సినిమాకు మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. అయితే, ‘తెరి’ సినిమాను బాలీవుడ్‌లో ‘బేబీ జాన్’ (Baby John) పేరుతో రీమేక్ చేయించారు అట్లీ (Atlee Kumar).
ఆ సినిమా అక్కడి బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది. ఈ క్రమంలో సినిమా కథలోని పాయింట్లను హరీశ్ శంకర్ రీచెక్ చేసుకోవాలి అనే సజెషన్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన ఇలాంటి పనులు చేస్తారు కూడా అంటున్నారు. మరి మార్పులు చేస్తారా? లేక ఇప్పటికే చేసినవి సరిపోతాయా అనేది చూడాలి. ‘బేబీ జాన్’, ‘తెరి’ చూసినవాళ్లను అడిగితే.. విజయ్ (Vijay Thalapathy) స్వాగ్, స్టైల్‌ని వరుణ్ ధావన్ (Varun Dhawan) మ్యాచ్ చేయలేకపోయాడు అని అంటున్నారు.
అయితే పవన్ విషయంలో ఆ ఇబ్బంది అస్సలు ఉండదు. కాబట్టి సరైన యాడ్ ఆన్స్ చేసుకొని హరీశ్ శంకర్ (Harish Shankar) ఈ సినిమాను తీస్తే చాలు తిరిగి తన పూర్వపు ఫామ్‌కి వచ్చేస్తారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎప్పుడు సినిమా షూట్ రీస్టార్ట్ అవుతుంది అని. ఎందుకంటే పవన్ ఇప్పుడు సినిమాలకు అంత విరివిగా డేట్స్ ఇవ్వలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటీ సీఎం అయ్యారు కదా. ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu), ‘ఓజీ’ (OG Movie) అయ్యాకనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్ట్ అవుతుంది.