ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సుశీల (75) బుధవారం వేకువజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల తెనాలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెనాలిలో ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
చిన్నికృష్ణ తన తల్లితో అనుబంధం గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తల్లి ప్రేమ గొప్పతనాన్ని తెలియజేస్తూ కవితలు కూడా రాశారు. జన్మజన్మలకు నీకే జన్మించాలని ఉందంటూ మదర్స్‌డే నాడు ఆయన ఓ ఎమోషనల్ వీడియో షేర్ కూడా చేశారు. ఆయన సినిమాల్లో తల్లి ప్రేమ నేపథ్యంలో సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటుంటాయి కూడా.
ఇక చిన్నికృష్ణ సంగతి చూస్తే.. బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’, ‘సీమ సింహం’, చిరంజీవి ‘ఇంద్ర’, అల్లు అర్జున్ ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్’, హవీష్ ‘జీనియస్’ లాంటి సినిమాలకు కథలు అందించారు. అయితే ప్రస్తుతం ఆయన రచయితగా అంత యాక్టివ్‌గా లేరు.