Allu Arjun: రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి సాయం అందించేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ కుటుంబానికి రూ.25 లక్షల సాయం ప్రకటించిన ఆయన, మరింత బాధ్యతగా వ్యవహరించారు. రేవతి కుమారుడు శ్రీ తేజ్‌ చికిత్స ఖర్చులను కూడా తానే భరిస్తున్న అల్లు అర్జున్, ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు.

Allu Arjun

అల్లు అరవింద్ కూడా ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ గురించి వైద్యులతో మాట్లాడుతున్నారు. వెంటిలేషన్ కూడా తీసేశారని, అతను ఇప్పుడు కొలుకుంటున్నాడు అని వివరణ ఇచ్చారు. ఈ విషాదం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, పుష్ప టీం తరఫున రూ.2 కోట్లు ఆర్థిక సాయం అందించనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఈ మొత్తం విరాళంలో రూ. కోటి అల్లు అర్జున్ నుంచి, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్ నుంచి, మిగతా రూ.50 లక్షలు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తరఫున అందించబోతున్నారు.

ఈ క్రమంలో పుష్ప టీం సభ్యులు, సుకుమార్, రవి, నవీన్, దిల్ రాజు తదితరులు శ్రీ తేజ్‌ ను ఆస్పత్రిలో పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెప్పినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవతి కుటుంబానికి సాయం అందించడమే కాకుండా, శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం కూడా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పుష్ప టీం సభ్యులంతా ఈ విషయంలో ఏకమై ముందుకు సాగడం పట్ల సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఆర్థిక సాయం రూపంలో రూ.2 కోట్ల చెక్కును టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. ఇక శ్రీ తేజ్ త్వరగా కోలుకొని సాధారణ జీవితానికి చేరుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. పుష్ప టీం తరఫున ప్రకటించిన ఈ ఆర్థిక సాయం రేవతి కుటుంబానికి కొత్త ఆశనిచ్చేలా ఉంది.

బరోజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags