God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

‘గాడ్‌ ఆఫ్‌ ది వార్‌’.. ఈ సినిమా గురించి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్‌ సినిమా ఎదురు చూస్తోంది. దానికి కారణం సినిమా కాంబినేషన్‌ మాత్రమే కాదు, సినిమా కథలో ప్రధానాంశం. ఈ సినిమా కుమార స్వామి ప్రధానంగా ఈ సినిమా రూపొందుతుంది వివిధ తరహాల్లో ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమా గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ చాలా గొప్పగా చెప్పారు కూడా.

God Of War

అయితే, ఇదంతా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల కానంతవరకే. ఎన్నో అంచనాలతో ఫస్ట్‌ విడుదల తేదీ వరకు వచ్చిన ఈ సినిమా ఎప్పుడైతే వాయిదా పడిందో.. అక్కడి నుండి నెగిటివిటీ మూటగట్టుకుంటూనే ఉంది. అనుకున్నట్లుగా ఆ సినిమా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే.. త్రివిక్రమ్‌ – హారిక హాసిని కాంబినేషన్‌లో వరుస సినిమాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ కాంబో ఇక చాలు అనుకున్నారు అంటూ వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ సినిమా మీద ప్రభావం పడుతుంది అని అనుకున్నారంతా. ఆ సినిమాకు భారీ బడ్జెట్‌ పెట్టాల్సి ఉండటంతో ఇప్పుడు రిస్క్‌ చేయాలని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అనుకుంటున్నారని వార్తలొచ్చాయి. దీంతో త్రివిక్రమ్‌ వేరే సినిమా వైపు వెళ్తున్నారు అని కూడా అనుకున్నారు. ఆ మరోవైపే చిరంజీవి అని కూడా లీకులొచ్చాయి. డీవీవీ దానయ్య బ్యానర్‌లో చిరంజీవితో ఓ సినిమా చేస్తారు త్రివిక్రమ్‌ అని పెద్ద ఎత్తున సన్నిహిత వర్గాల నుండే లీకులు వచ్చాయి.

అయితే, అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం హారిక హాసిని సోషల్‌ మీడియాలో చినబాబు, తారక్‌, కల్యాణ్ రామ్‌, త్రివిక్రమ్‌ ఫొటో ఒకటి షేర్‌ అయింది. దానర్థం.. సినిమా అలానే ఉంది.. మేం చేస్తాం అని చెప్పడమే. అయితే ఇప్పటికిప్పుడు సినిమా స్టార్ట్‌ అయ్యే పరిస్థితి లేనప్పుడు ఎందుకు అందరూ కలసి ఓ గ్రూప్‌ ఫొటోకు పోజిచ్చారు అనేదే ఇక్కడ ప్రశ్న.

నిజానికి ఈ సినిమా కథ తొలుత నుండి అల్లు అర్జున్‌ నుండి తారక్‌కి.. బన్నీ నుండ ఎన్టీఆర్‌కి షటిల్‌ సర్వీసు తిరిగినట్లు తిరిగింది. ఫైనల్లీ నాగవంశీ ప్రయత్నాల తర్వాత ఎన్టీఆర్‌ దగ్గర ఆగింది. ఇప్పుడు ఈ కొత్త రూమర్లు. ఏంటో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఈ కష్టాలు.

 అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus