Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: సఖి… వరుస నిరాశలకు బ్రేక్‌ వేస్తుందా?

Keerthy Suresh: సఖి… వరుస నిరాశలకు బ్రేక్‌ వేస్తుందా?

  • January 27, 2022 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: సఖి… వరుస నిరాశలకు బ్రేక్‌ వేస్తుందా?

పేరుకే స్టార్‌ హీరోయిన్‌ సరైన హిట్‌లు లేవు. టాలీవుడ్‌లో చాలామంది కథానాయికల గురించి ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్‌గా ఇలాంటి మాటలు పడుతున్న హీరోయిన్‌ కీర్తి సురేశ్‌. ‘మహానటి’తో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న కీర్తి… ఆ తర్వాత ఓవర్‌నైట్‌ స్టార్‌లా మారిపోయింది. కానీ ఆ తర్వాత సరైన విజయం అందుకోలేకపోయింది. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడుతున్న కీర్తికి… ఇప్పుడు ‘గుడ్‌ లక్‌ సఖి’ గుడ్‌ లక్‌ తీసుకొస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

‘మహానటి’తో జాతీయ పురస్కారం దక్కించుకుంది కీర్తి సురేశ్‌. ఆమె నటనా ప్రతిభ గురించి చెప్పడానికి ఇదొక్క మాట చాలు. గ్లామర్ షోకి దూరంగా ఉన్నా… ఆమెలో నటిని చూసి స్టార్‌ హీరోల సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో యువ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వస్తోంది. అలా ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. కానీ రెండేళ్ల‌ నుండి సరైన హిట్టు లేదు.

హీరోయిన్‌గా చేసినా, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేసినా విజయం ముచ్చట మాత్రం తీరడం లేదు. ‘పెంగ్విన్‌’, ‘మిస్ ఇండియా’ అంటూ సోలో సినిమాలు చేసింది. అవి విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత రజనీకాంత్‌ ‘అన్నాత్తై’లో చెల్లెలుగా కనిపించింది. ఆ సినిమా పరిస్థితీ అంతే. ఇక మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో ‘మ‌ర‌క్క‌ర్‌’లో కనిపించింది. అదీ నిరాశే మిగిల్చింది. నితిన్‌ హీరోగా చేసిన ‘రంగ్‌దే’లో ఆమె పాత్రకు మంచి స్పందనే వచ్చింది. కానీ సినిమాకు పెట్టినంత రాలేదు అంటారు.

అలా ఆమెకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సరైన విజయాలు దక్కడం లేదు. ఇప్పుడు నగేశ్‌ కుకునూర్ దర్శకత్వంలో చేసిన ‘గుడ్‌ లక్‌ సఖి’ 28న రాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి రిలీజ్‌ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా విజయం అందించి, ట్రాక్‌ మారుస్తుందేమో చూడాలి. ఈ సినిమా గెలుపునిస్తే మరిన్ని ఇలాంటి సినిమాలు చేసే ధైర్యం కీర్తికి, ఆమెతో పని చేయాలనుకున్న దర్శకులకు వస్తుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Good Luck Sakhi
  • #jagapathi babu
  • #keerthy suresh
  • #Nagesh Kukunoor

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

15 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

13 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

14 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

15 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version