Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోదరి సుహాసిని ఆ పార్టీలో చేరతారా?

  • April 1, 2024 / 10:41 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు సులువుగా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా వరుసగా పాన్ ఇండియా సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోదరి సుహాసిని కొన్నేళ్ల క్రితం టీడీపీ తరపున పోటీ చేసి ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు.

సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా ఆమె కలవగా ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సుహాసిని కాంగ్రెస్ లో చేరితే ఆమెకు కీలక పదవి లభించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లోకి ఈ మధ్య కాలంలో వలసలు పెరిగాయనే సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి సుహాసిని పుష్పగుచ్ఛం ఇచ్చారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయాల్లో సత్తా చాటాలనే ఆలోచన ఆమెకు ఉండగా ఆమె కోరిక ఈసారైనా తీరుతుందేమో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉండటంతో సుహాసిని జీవితంలో ఏం జరుగుతుందో చూడాలి. నందమూరి సుహాసినిపై అభిమానం ఉన్నా తారక్, కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రస్తుతం పాలిటిక్స్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు సపోర్ట్ చేయడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్, కళ్యాణ్ రామ్ రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటున్నారు.

అయితే నందమూరి హీరోల సపోర్ట్ లేకుండా సుహాసిని రాజకీయాల్లో సక్సెస్ కావడం సులువైతే కాదనే చెప్పాలి. నందమూరి సుహాసినికి తమ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. త్వరలో ఆమె పొలిటికల్ ప్లాన్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus