తేజ సజ్జా (Teja Sajja) ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ (Hanu Man) మూవీ ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 330 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా ఓటీటీలలో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఓపెనింగ్ సీన్ లోని ట్విస్ట్ ను చివర్లో చూపించారని అది ఎవరూ ఊహించలేదని అన్నారు.
హనుమాన్ మూవీని చక్కగా తెరకెక్కించారని ఆయన దైవభక్తుడని పరుచూరి పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పాతాళ భైరవి స్పూర్తి ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించిందని ఆయన తెలిపారు. చిన్న పిల్లాడు పెద్ద విలన్లను కొట్టినట్టు చూపిస్తే బాగుండదు కాబట్టి హీరోకు దైవ శక్తి తోడు ఉన్నట్టు చూపించారని పరుచూరి పేర్కొన్నారు. తేజ సజ్జాతో హనుమాన్ తీయడానికి ప్రశాంత్ వర్మ భయపడలేదని దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు.
సినిమా సక్సెస్ అందులోని సీన్స్ పై ఆధారపడి ఉంటుందని సినిమాలో అక్కాతమ్ముళ్ల అనుబంధం కూడా అద్భుతమని ఆయన తెలిపారు. అక్క పాత్రకు ఇచ్చిన ముగింపును ఊహించలేదని పరుచూరి పేర్కొన్నారు. సెకండాఫ్ లో నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. యువత కోసం ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఇం కొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన సినిమా తీసి నేటి తరాన్ని ఆకర్షించారని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. చిన్న మూవీకి ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్ కు పరుచూరి సైతం ఫుల్ పాజిటివ్ రివ్యూ ఇవ్వడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. హనుమాన్ నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.