Kalyan Ram: కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీపై పెరుగుతున్న అంచనాలు.. కానీ?

  • October 23, 2023 / 05:10 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మూడు రోజుల్లో దాదాపుగా 33 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. బాబాయ్ బాలయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో అబ్బాయ్ కళ్యాణ్ డెవిల్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాలి.
నవంబర్ నెలలో డెవిల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఒకింత భారీ బడ్జెట్ తో డెవిల్ మూవీ తెరకెక్కగా 2023 సంవత్సరం నవంబర్ 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ కు మరో సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. బింబిసారతో సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో నిరాశపరిచారు. కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) రెమ్యునరేషన్ 6 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండగా ఈ సినిమా ఇతర భాషల్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

కళ్యాణ్ రామ్ ఒకవైపు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. డెవిల్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందో లేదో తెలియాలంటే ఈ సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus