తమిళ సంవత్సరాదికైనా మహేష్ లుక్ చూస్తామా?
- April 5, 2017 / 06:50 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు 23 మూవీ ఫస్ట్ లుక్ శ్రీరామనవమికి కూడా రిలీజ్ కాలేదు. సంక్రాంతి నుంచి ప్రతి పండుగకి మహేష్ లుక్ వస్తుందని ఎదురుచూసి అభిమానులు విసుగుచెందారు. తొందర్లోనే రిలీజ్ చేస్తామని స్వయంగా మహేష్ చెప్పడంతో శ్రీరామనవమికి వస్తుందని అనుకున్నారు. పండుగ వచ్చినా లుక్ పై కనీసం చిత్ర బృందం ప్రకటన చేయలేదు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడవ తేదీ వరకు వియాత్నం లో జరిగింది.
చెన్నైకి తిరిగి వచ్చిన చిత్ర బృందం రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టింది. ఇక ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందని మురుగదాస్ టీమ్ సభ్యులను అడగగా తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్ 14 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని డైరక్టర్ కోరగా మహేష్ ఓకే చెప్పిన్నట్లు తెలిసింది. తొలిసారి కోలీవుడ్ లోకి ఎంటర్ అవుతుండడంతో ఈ సెంటిమెంట్ బాగుంటుందని ప్రిన్స్ భావిస్తున్నట్లు సమాచారం. సెంటిమెంట్ సరే ఆరోజైనా మిస్ కాకుండా వస్తే అదే పదివేలు అంటున్నారు అభిమానులు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















