NTR, Koratala Siva: ఆ కన్ఫ్యూజన్ కు కొరటాల తెర దించుతారా?

  • November 24, 2022 / 11:41 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయో అర్థం కాక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. తాజాగా తారక్ ప్రముఖ కంపెనీకి చెందిన యాడ్ లో నటించగా ఈ యాడ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత తారక్ షూటింగ్ లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

తారక్ కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరగా మొదలుపెడితే బాగుంటుందని కన్ఫ్యూజన్ కు కొరటాల తెర దించితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా షూటింగ్ ను ఆలస్యం చేయడం వల్ల సినిమాపై బయ్యర్లలో, ప్రేక్షకుల్లో నెగిటివ్ ఒపీనియన్ కలిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ చాలా ఆలస్యమైందని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసి త్వరగా ప్రకటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

యాడ్ ట్రీట్ మాత్రమే మాకు సరిపోదని సినిమాకు సంబంధించి కొత్త అప్ డే కావాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జై లవకుశ తర్వాత కళ్యాణ్ రామ్ తారక్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. తారక్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం.

తన సినిమాలతో కళ్యాణ్ రామ్ ను నిర్మాతగా కూడా నిలబెట్టాలని తారక్ భావిస్తున్నారు. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఏదైనా ఆసక్తికర అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. 2023 దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus