Pooja Hegde: రాధేశ్యామ్ లో సస్పెన్స్ ఎలిమెంట్ ఇదేనా..?

  • April 5, 2021 / 12:21 PM IST

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో పూజా హెగ్డే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్నారు. తెలుగులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రభాస్ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ మూవీ `జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ ఏడాది జులై 30వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కథలో నాగార్జున నటించిన గీతాంజలి సినిమా యాంగిల్ ఉంటుందని తెలుస్తోంది. చావు పుట్టుకల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.

సినిమాలో హీరోహీరోయిన్లకు ప్రాణ భయం ఉంటుందని హీరోహీరోయిన్లలో ఎవరో ఒకరు చనిపోతారా..? లేక ఇద్దరూ బ్రతుకుతారా..? అనే సస్పెన్స్ ఎలిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. సినిమాలో సెకండాఫ్ లో పూజా హెగ్డే రోల్ నటనలో ప్రభాస్ ను డామినేట్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో ప్రభాస్ చేయి చూసి జాతకాలు చెప్పే వ్యక్తి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus