టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ జాతీయ స్థాయిలో అభిమానుల్ని సంపాదించినా, ఈ రెబల్ స్టార్ బల, బలగం మాత్రం తెలుగు ప్రేక్షకులే. బాహాబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో, ఆయన నటించే చిత్రాల పై భారీ అంచనాలు ఉంటున్నాయి. దీంతో ఆ అంచనాలు అందుకునే క్రమంలో ప్రభాస్ వేస్తున్న అడుగులు అంటే టేకప్ చేస్తున్న సినిమాలు మాత్రం ఫ్యాన్స్‌ను కలవర పెడుతున్నాయి.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా మూవీ అంటూ సాహోతో చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. రెండేళ్ళ సమయం, భారీ అంచనాలు, హై బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి ప్రభాస్‌కే కాకుండా ఆయన అభిమానులను కూడా నిరాశపర్చింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ నుండి వస్తున్న రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా మూవీనే. జిల్ ఫేం డైరెక్టర్ రాధా కృష్ణ ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. ఈ సినిమా లేట్ అవడానికి కోవిడ్ కూడా ఒక కారణంగా అనుకోండి.
ఇక ఆ తర్వాత కూడా ప్రభాస్ భారీ ప్రాజెక్టులకే సైన్ చేసినా, అవి మాత్రం ప్రేక్షకుల్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. రాధే శ్యామ్ తర్వాత మహానటి ఫేం నాగ అశ్విన్‌తో సినిమాను ఓకే చేశాడు ప్రభాస్. అయితే మధ్యలో బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ మూవీని ప్రకటించి ఒక్కసారిగా అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ చేస్తున్న ప్రకటనలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నాయి.
బాటీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కుతుంది. బాలీవుడ్ మేకర్ కావడంతో ప్రతినాయకుడు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్‌ను ఫైనలైజ్ చేయగా, సీత పాత్రకి కృతి సనన్ పేరు వినిపిస్తోంది. ఇక తాజాగా లక్షణుడి పాత్రకి సన్నీ సింగ్ అనే యువ నటుడు నటిస్తున్నాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఆదిపురుష్‌లో మొత్తం బాలీవుడ్ తారలే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ప్రభాస్ తెలుగు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని సమచారం. ఎందుకంటే కాస్టింగ్‌లో జరిగిన గందరగోళం కారణంగా తెలుగులో సాహోకి మైనస్ అయ్యింది. హిందీలో పర్వాలేదనిపించినా హీరోయిన్‌తో సహా నార్త్ నటులే ఎక్కువగా ఉండడంతో ఎమోషనల్‌గా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు ఆదిపురుష్ మూవీలో దాదాపుగా అందరూ నార్త్ బ్యాచ్చే నటించే అవకాశం ఉంది. దీంతో ప్రభాస్ సినిమాకి మరోసారి కాస్టింగ్ దెబ్బేస్తుందా, అసలు ప్రభాస్ రాంగ్ ప్రాజెక్ట్ టేకప్ చేశాడా అని డార్లింగ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.