Ragini, Sanjana: రాగిణి, సంజన లు డ్రగ్స్ తీసుకున్నారట.. సమన్లు రెడీ..!

శాండల్ వుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కేసుల హడావిడి మొదలు కాబోతుందని స్పష్టమవుతుంది.ఈ క్రమంలో అక్కడి హీరోలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతల గుండెల్లో మళ్ళీ టెన్షన్ మొదలైనట్టు వినికిడి. దీనికి అసలు కారణం లేకపోలేదు.అక్కడి హీరోయిన్లు అయిన సంజన,రాగిణి లు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్ట్ లో తేలడమే.! 2020 వ సంవత్సరం చివర్లో వీళ్ళిద్దరి వెంట్రుకలను ఎఫ్.ఎస్.ఎల్ కు పంపారు పోలీసులు. ఈ క్రమంలో రిపోర్ట్ లో వీళ్ళిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందట.

ఈ కారణంగానే మరోసారి ఈ హీరోయిన్లకు సమన్లు జారీ చేయడానికి రెడీ అవుతున్నట్టు బెంగుళూర్ పోలీసులు అక్కడి మీడియాకి తెలియజేసారు. చూస్తుంటే మరోసారి వీళ్ళిద్దరూ అరెస్ట్ అవ్వడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో గతేడాది ఎండింగ్ లో నటి సంజన ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు.అంతకుముందు ఆమె సన్నిహితుడు మరియు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన రాహుల్‌ కూడా అరెస్ట్ అయ్యాడు. అతని ఫోన్ ను తనిఖీ చేయగా పోలీసులకు సంజనా పేరు లభించింది.

తర్వాత జరిగిన తంతు అందరికీ తెలిసిందే. ఇక అంతా అయిపోయింది.. ఆమె రిలీజ్ అయ్యింది .. పీడకలలా దానిని మరిచిపోయి సినిమాలు చేసుకుంటుంది సంజనా.. అని అంతా సంతోషించే లోపే ఇప్పుడు మళ్ళీ ఆమెకు షాక్ తగిలినట్టు అయ్యింది.మొన్నటి వరకు ఈమె ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో కూడా స్టే చేసిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus