Saif Ali Khan: ఆ సినిమాతో అయినా సైఫ్ అలీఖాన్ ప్రేక్షకులను మెప్పిస్తాడా?

ఆదిపురుష్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ ఎవరనే ప్రశ్నకు సైఫ్ అలీ ఖాన్ పాత్ర పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ పాత్రలో మరో నటుడు నటించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని చెప్పవచ్చు. ఆదిపురుష్ లో సైఫ్ అలీ ఖాన్ నడకపై కూడా నెగిటివ్ కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. అయితే దేవర సినిమాలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సైఫ్ అలీ ఖాన్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు.

అయితే ఆదిపురుష్ కు మైనస్ అయిన (Saif Ali Khan) సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాకు ప్లస్ అవుతారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో అయినా సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది. కొరటాల శివ సైఫ్ రోల్ ను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. దేవర సినిమా సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమాలో ఇంటర్వల్, క్లైమాక్స్ ట్విస్టులు బాగుంటాయని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus