Bollywood Stars: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బాలీవుడ్ స్టార్స్ సత్తా చాటుతారా?

  • May 13, 2023 / 01:01 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతుండగా ఆ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. టాలీవుడ్ సినిమాలలో నటించడానికి బాలీవుడ్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాలో రావణుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సీత రోల్ లో కృతిసనన్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ మారుతి కాంబో మూవీలో ముఖ్యమైన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో సైఫ్ అలీ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని బోగట్టా. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య అనిల్ కాంబో మూవీలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న సైంధవ్ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రవితేజ వరుణ్ ధావన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోల సినిమాలలో బాలీవుడ్ స్టార్స్ నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. (Bollywood) బాలీవుడ్ స్టార్స్ నటించడం వల్ల ఈ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus