Mahesh Babu: మహేష్ 90 డేస్ డిమాండ్ కు త్రివిక్రమ్ అంగీకరిస్తారా?

  • May 16, 2023 / 01:59 PM IST

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను కచ్చితంగా విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కంటిన్యూగా 90 రోజుల పాటు ఈ సినిమాను షూట్ చేయాలని మహేష్ డిమాండ్ అని బోగట్టా. ఈ విధంగా షెడ్యూల్ ను ప్లాన్ చేసి డేట్లు ఫిక్స్ చేయాలని మహేష్ త్రివిక్రమ్ ను కోరారని సమాచారం.

మహేష్ బాబు డిమాండ్ ను త్రివిక్రమ్, ఈ సినిమా నిర్మాతలు తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్, లుక్ రిలీజ్ కానున్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీన మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ కానుంది. మహేష్ సినిమాల శాటిలైట్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలను ఎక్కువగా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ పారితోషికం ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

సినిమా సినిమాకు మహేష్ (Mahesh) రెమ్యునరేషన్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ జక్కన్న కాంబినేషన్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల పాటు జరగనుందని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ దొరుకుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus