Trivikram: త్రివిక్రమ్ కొడుకు డైరెక్టర్ గా సక్సెస్ కావడం సాధ్యమేనా?

  • April 3, 2023 / 08:19 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై ఊహించని రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ సౌజన్యలకు ఇద్దరు కొడుకులు కాగా వీళ్లిద్దరూ మీడియాకు దూరంగా ఉంటారు. అయితే త్రివిక్రమ్ కొడుకులకు సినిమాలపై ఆసక్తి ఉందని తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

త్రివిక్రమ్ (Trivikram) భార్య సౌజన్య మాట్లాడుతూ తన కొడుకులలో ఒకరికి డైరెక్షన్ అంటే ఇష్టమని సన్నివేశాన్ని బట్టి వాడిన కెమెరా గురించి వాడిన లెన్స్ గురించే చెప్పగలడని ఆమె అన్నారు. దర్శకుల కొడుకులు దర్శకులుగా, నటులుగా సక్సెస్ సాధించడం ఇండస్ట్రీలో అరుదుగా జరుగుతుంది. అయితే త్రివిక్రమ్ కొడుకు మాత్రం ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. మరో నాలుగేళ్ల తర్వాత త్రివిక్రమ్ కొడుకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని బోగట్టా.

త్రివిక్రమ్  సలహాలు, సూచనలతో కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ పారితోషికం ప్రస్తుతం 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తెలుగు నేటివిటీ ఉన్న కథలను త్రివిక్రమ్  ఎంచుకుంటున్నారు. త్రివిక్రమ్ (Trivikram) త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ మహేష్ తో తెరకెక్కించే సినిమా కొత్తగా ఉండనుందని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తీస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

త్రివిక్రమ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 2024 సంక్రాంతి కానుకగా మహేష్ త్రివిక్రమ్  కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. స్క్రిప్ట్ లు వినడంతో పాటు ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నానని సాయి సౌజన్య వెల్లడించారు. సాయి సౌజన్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus