Yash: ‘కేజీఎఫ్’ స్టార్ కి ఇబ్బందులు తప్పవా..?

  • April 19, 2022 / 04:47 PM IST

కన్నడ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వసూళ్లను సాధించింది ‘కేజీఎఫ్2’ సినిమా. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో హీరోగా నటించారు యష్. నిజానికి కన్నడ ఇండస్ట్రీకి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. అక్కడన్నీ సాదాసీదా సినిమాలు వచ్చేవి. అందులో సగంకి పైగా సినిమాలు రీమేక్ లే. అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘కేజీఎఫ్2’ అంతకుమించి సక్సెస్ అయింది.

Click Here To Watch NOW

ఈ సినిమాతో యష్ ఇమేజ్ మారిపోయింది. దేశవ్యాప్తంగా అతడికి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో వచ్చే ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ను అతడు ఎంతమేర ఉపయోగించుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యష్ కి ‘కేజీఎఫ్’ లాంటి హిట్ పడాలంటే మళ్లీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేయలేదు. కానీ ప్రస్తుతం ఆయన టాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

ప్రభాస్ తో ‘సలార్’, ఎన్టీఆర్ తో మరో సినిమా కమిట్ అయ్యారు. ఆ తరువాత మరి కొందరు టాలీవుడ్ స్టార్స్ ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి రాబోయే కొన్నేళ్లలో యష్ తో సినిమా చేసే ఛాన్స్ లేదు. పోనీ ‘కేజీఎఫ్’ రేంజ్ లో సినిమా తీసే దర్శకుడు కన్నడ ఇండస్ట్రీలో యష్ కి దొరుకుతాడా..? అంటే సందేహమే. టాలీవుడ్ దర్శకులు ఎవరైనా యష్ తో సినిమాలు చేస్తారా..? అంటే ప్రస్తుతం అందరూ బిజీగా ఉన్నారు.

గతంలో ప్రభాస్ కూడా ‘బాహుబలి’ లాంటి హిట్టు సినిమా తీసి ఆ తరువాత వరుసగా రెండు ఫ్లాప్ లు ఇచ్చారు. ఇప్పుడు యష్ తన ఫేమ్ ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే అతడి కెరీర్ కి ఇబ్బందులు తప్పవు. మరి యష్ కి ఆ రేంజ్ డైరెక్టర్ దొరుకుతాడేమో చూడాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus