సినిమా ఫ్లాప్ అని అఫీషియల్ గా డిక్లేర్ చేసినట్లుంది!

ఈ అమెజాన్ ప్రైమ్ అనేది అందుబాటులోకి వచ్చాక.. ఏదైనా కొత్త పోస్టర్ లేదా టీజర్ వచ్చిందంటే, అందులో క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ చూడడం మానేసి “అమేజాన్ ప్రైమ్ లోగో” ఉందేమో చూసుకొంటున్నారు. అందుకు కారణం సినిమా సూపర్ హిట్ అయితే 40, 50 రోజుల్లో.. పొరపాటున ఫ్లాప్ అయితే 25 నుంచి 30 రోజుల్లో అమేజాన్ ప్రైమ్ లో సబ్ టైటిల్స్ తో సహా సదరు సినిమా ప్రత్యక్షమవుతుండడమే. ఏడాదికి కేవలం 1000 రూపాయలతో దొరికే అమేజాన్ సబ్ స్క్రిప్షన్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు బోలెడు ఉంటుండడంతో.. థియేటర్ కి వెళ్ళి ఒక్క సినిమాకి వెయ్యి రూపాయలు వదిలించుకొనే బదులు ఇంట్లో కూర్చుని హ్యాపీగా కావాల్సినప్పుడల్లా.. పాజ్ చేసుకొంటూ సినిమా చూడడం బెటర్ అనుకొంటున్నారు జనాలు.

అయితే.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సెప్టెంబర్ 13న తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన సమంత “యూ టర్న్”కి భీభత్సమైన ఓపెనింగ్స్ రాకపోయినా.. మౌత్ టాక్ పుణ్యమా అని కాస్త పుంజుకొంది. అయితే ఆశించిన స్థాయి కలెక్షన్స్ మాత్రం లేవు. సినిమా హిట్టా, ఫట్టా అని ఇంకా ట్రేడ్ వర్గాల్లోనూ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో స్వయంగా నిర్మాతలే “మా సినిమా ఫ్లాప్” అని ఇండైరెక్ట్ గా ఎనౌన్స్ చేశారు. అందుకు కారణం అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 13 అనగా.. సినిమా విడుదలైన సరిగ్గా నెలరోజులకి అమేజాన్ ప్రైమ్ లో “యూ టర్న్” లైవ్ స్ట్రీమ్ అవ్వనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus