నేటి అమ్మాయిలను ప్రతిబింభించే పాత్రలు

స్ట్రాంగ్ హీరోయిన్స్. అంటే బలమైన శరీరం కలిగిన కథానాయికలు అని కాదు.. మానసికంగా దైర్యం కలిగిన వారని అర్ధం. తమకాళ్లపై బతకడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, మనసులోని మాటను బయటకు చెప్పడం, జీవితంపై ఒక క్లారిటీ ఉండడం.. ఇవన్నీ నేటి అమ్మాయిల్లో ఉన్న క్వాలిటీస్. వాటిని ప్రతిబింభించే విధంగా నేటి దర్శకులు హీరోయిన్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ట్రాంగ్ హీరోయిన్ పాత్రలపై ఫోకస్..

మొగుడు ఎలా ఉండాలంటే ?తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో నేటి అమ్మాయిలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయాన్నీ మిర్చి సినిమాలో వెన్నెల (అనుష్క) పాత్ర చెప్పింది. “పెళ్లి అంటే జీవితంలో ఒకే సారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ (గుండెల్లో) పెట్టుకొని చూసుకొనే మనిషి దొరకాలి” అంటూ అమ్మాయిల కోరికను బయట పెట్టింది.

ఏ విషయం దాచుకోరు..ప్రేమించిన సంగతిని మనసులోనే పెట్టుకొని, కుమిలిపోయే రకం కాదు ఇప్పటి అమ్మాయిలు. అటువంటివారికి అద్దం పట్టింది నేనింతే సినిమాలో సంధ్య పాత్ర. ఇందులో ఆమె ప్రేమించిన విషయాన్నీ ” ఒరే నీ పిచ్చి ఏమిటి అని అడిగావు గుర్తుందా ? నువ్వేరా నా పిచ్చి. పిచ్చి నా కొడకా.” అంటూ దైర్యంగా చెప్పి గుర్తుండి పోయేలా చేసుకుంది.

అంత ఈజీ కాదు ఆనాటీ పేర్లు పెట్టుకున్నప్పటికీ నేటి అమ్మాయిలను బుట్టలో పడేయడం అంత ఈజీ కాదు. అదే విషయాన్నీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీలో సీత పేరు పెట్టుకున్న హీరోయిన్ “సీత ఇక్కడ.. సీతతో అంత ఈజీ కాదు” అంటూ డైలాగ్ చెప్పి మనసుదోచుకుంది. ఈ పాత్రలో రెజీనా చక్కగా నటించింది.

అమాయకమే కానీ..ఇంకా అమ్మాయిల్లో అమాయకులు ఉన్నారు. కానీ వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయాలో స్పష్టంగా తెలుసు. అందుకే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి పోషించిన సీత పాత్రని తెలుగువారందరూ ఇంట్లో సభ్యురాలిగా చేసుకున్నారు. ఆ క్యారక్టర్ చెప్పే “ఏమో.. నాకు అన్ని ఆలా తెలిసిపోతాయంతే” అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది.

ఉన్నదీ ఉన్నట్టుగా .. “ఈ కాలం పిల్లలు అర్ధమే కారు..” నేటి యువతులను చూసి బామ్మలు అనే మాట ఇది. అవును ఏది ఎలా అడగాలో? ఎవరిని అడగాలో తెలియదు. అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ మిథున ఎవరు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా .. “నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న”అంటూ ఉన్నదీ ఉన్నట్టూ చెప్పి నవ్వులు పూయించింది.

చిలిపిదనం అమ్మాయికి చిలిపిదనం ఉంటేనే అందం. కాలేజీకి వెళ్లిన అమ్మాయి తలదించుకుని ఇంటికి రావాలనే పాత చింతకాయ పచ్చడి లాంటి సూత్రాలను అటక మీద పెట్టి అబ్బాయిలతో సమానంగా కాలేజీలైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త బంగారు లోకం లో హీరోయిన్ స్వప్న “ఏ..క్క..డా”, “ఏం..దు..కు” అంటూ రాగాలు తీస్తూ మాట్లాడి ఆకట్టుకుంది.

కౌంట్ ఇక్కడ ..నేటి అమ్మాయిలు ఉద్యోగం చేయడమే కాదు.. సంపాదించినా ప్రతి పైసాని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. అందుకు ప్రతి రూపమే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో ప్రార్ధన క్యారక్టర్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రార్ధన పాత్రలో అలరించింది. ” ప్రార్ధన.. ప్రతి పైసా కౌంట్ ఇక్కడ” అంటూ దడ దడలాడించింది.

ప్రశ్నించే తత్వంమంచి ఆస్థి, చదువుకున్న కుర్రోడికి తన కూతురు నచ్చిందంటే.. కూతురి అభిప్రాయం కూడా అడగకుండా పెళ్ళిచేయడానికి కొంతమంది పేరెంట్స్ సిద్ధమయిపోతారు. ఆ విషయాన్నీ శశిరేఖా పరిణయంలో శశి క్యారక్టర్ ధైర్యంగా ప్రశ్నించి శెభాష్ అనిపించుకుంది.

ఇలా నేటి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచే, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పాత్రలను సృష్టిస్తున్న గొప్ప దర్శకులకు మహిళా దినోత్సవం సందర్భం గా మహిళల తరుపున ఫిల్మ్ ఫోకస్ కృతజ్ఞతలు తెలుపుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus