Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

‘అఖండ’… నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ దీనికి సీక్వెల్ గా ‘అఖండ 2’ కూడా రూపొందింది. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి నుండి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా మ్యాచ్ చేసిందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ‘అఖండ 2’ కి ప్రీమియర్స్ తోనే మిక్స్డ్ టాక్ వచ్చింది.

Boyapati Srinu

హిట్టు సీక్వెల్, అలాగే కాంబినేషన్ క్రేజ్ కారణంగా దీనికి టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మొదటి వీకెండ్ మొత్తం మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది? అనేది సోమవారం కలెక్షన్స్ తో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘అఖండ 2’ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అఖండ’ సినిమాలో ట్రాన్స్ ఎపిసోడ్ బాగుంది అని చెప్పి ‘అఖండ 2’ లో అలాంటి ఎపిసోడ్స్ అవసరం లేకపోయినా బలవంతంగా ఇరికించారు అని మెజారిటీ ఆడియన్స్ విమర్శిస్తున్నారు. ఇలాంటి ట్రోల్స్ మధ్య బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ వాటికి మరింత బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది.

బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అఖండ 2’ మాత్రమే కాదు.. దీనికి కొనసాగింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ‘ ‘అఖండ..’ అనేది ‘అవెంజర్స్’ వంటిది. దానికి ఎండింగ్ అంటూ ఏమీ ఉండదు. ‘అఖండ 2′ లో అఘోర పాత్ర శంబాలాకి వెళ్లినట్టు చూపించాం. మనకి ఓపిక ఉన్నంత వరకు దానికి కంటిన్యుటీ కథలు రాయచ్చు’ అంటూ బోయపాటి చెప్పారు.బోయపాటి శ్రీను కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొంతమంది వీటిని చమత్కరిస్తుండటం గమనార్హం.

‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus