‘కే.జి.ఎఫ్’ రెండు వారాల కలెక్షన్ల వివరాలు..!

కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘కే.జి.ఎఫ్’ రెండో వారంలో కూడా తన జోరును కొనసాగిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం ‘కే.జి.ఎఫ్’ కు ఏ చిత్రం కూడా పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. ‘అంతరిక్షం’ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలు నిరాశపరచడంతో ‘కే.జి.ఎఫ్’ చిత్రానికి బాగా కలిసొచ్చింది. తరువాత విడుదలైన ‘ఇదంజగత్’ ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు కూడా ‘కే.జి.ఎఫ్’ కలెక్షన్లను ఆపలేకపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం ఈ చిత్రం 5 కోట్ల షేర్ ను వసూల్ చాయగా… రెండో వారం కూడా నాలుగు కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. ఈ చిత్ర తెలుగు వెర్షన్ తీసుకున్న ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక 2018 డబ్బింగ్ చిత్రాలలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రజనీ కాంత్ -శంకర్ ల ‘2.0’ ఉండగా … సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా.. ఇప్పటివరకూ ఉన్న విశాల్ ‘అభిమమన్యుడు’ ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది ‘కే.జీ.ఎఫ్’ చిత్రం.

రెండు వారాలు పూర్తయ్యే సరికి ‘కే.జీ.ఎఫ్’ ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజామ్: 3.90 cr
సీడెడ్: 1.81 cr
ఉత్తరాంధ్ర: 1.07 cr


ఈస్ట్ : 0.54 cr
వెస్ట్: 0.45 cr

కృష్ణ: 0.82 cr
గుంటూరు: 0.71 cr
నెల్లూరు: 0.21 cr

ఏపీ + తెలంగాణా: రూ. 9.51 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus