‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన యశ్..!

Advertisement

యశ్ హీరోగా వచ్చిన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కె.జి.ఎఫ్’ ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో కూడా సూపర్ హిట్టయ్యింది ఈ చిత్రం. ఓ కన్నడ చిత్రం ఇంత పెద్ద హిట్టవ్వడం మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రం సీక్వెల్ కూడా ఈమధ్యే మొదలైన సంగతి తెలిసిందే.

ఈ సీక్వెల్ కోసం మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో.. చెప్పడానికి తాజాగా విడుదలైన ఓ పిక్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు.

రాఖీ భాయ్ అదేనండీ హీరో యశ్ మంచి రాయల్ లుక్ తో కనిపిస్తున్నాడు. సూటు బూటు వేసుకుని లాంగ్ హెయిర్, గెడ్డం మొత్తం స్టైలిష్ గా ఉన్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో పెత్తనం మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న రాఖీ భాయ్ పక్కా బిజినెస్ మెన్ గా మారినట్టు ఉన్నాడు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 2020 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని కీలక భాగాన్ని చిత్రీకరించారట. తొందరలోనే షూటింగ్ పూర్తి చేసి సిజి.వర్క్ ని మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎటువంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus