సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.
మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.కానీ సోమవారం నుండి డల్ అయ్యింది.కృష్ణ గారి మరణం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.ఓవరాల్ గా మొదటి వీక్ పర్వాలేదు అనిపించింది. కానీ ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
3.36 cr
సీడెడ్
0.58 cr
ఉత్తరాంధ్ర
0.78 cr
ఈస్ట్
0.39 cr
వెస్ట్
0.24 cr
గుంటూరు
0.42 cr
కృష్ణా
0.45 cr
నెల్లూరు
0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.42 cr
తమిళనాడు
0.88 cr
హిందీ
0.51 cr
ఓవర్సీస్
2.40 cr
రెస్ట్
0.53 cr
టోటల్ వరల్డ్ వైడ్
10.74 cr (షేర్)
‘యశోద’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల సమాచారం.అయితే ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.10.74 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.76 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు అందించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ తర్వాత ఈ మూవీ డౌన్ అయ్యింది. రెండో వీకెండ్ ను వాడుకుంటే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.