సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.
మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.51 cr
సీడెడ్
0.45 cr
ఉత్తరాంధ్ర
0.57 cr
ఈస్ట్
0.31 cr
వెస్ట్
0.18 cr
గుంటూరు
0.32 cr
కృష్ణా
0.33 cr
నెల్లూరు
0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.81 cr
తమిళనాడు
0.62 cr
హిందీ
0.36 cr
ఓవర్సీస్
2.00 cr
రెస్ట్
0.35 cr
టోటల్ వరల్డ్ వైడ్
8.14 cr (షేర్)
‘యశోద’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ కు ఈ మూవీ రూ.8.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.12.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఓవర్సీస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో స్టడీగా రాణించి నెక్స్ట్ వీక్ కూడా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.